end
=
Wednesday, May 15, 2024
సినీమాSinger Mangli:రాళ్ల దాడిపై స్పందించిన మంగ్లీ
- Advertisment -

Singer Mangli:రాళ్ల దాడిపై స్పందించిన మంగ్లీ

- Advertisment -
- Advertisment -

సింగర్ మంగ్లీ (Singer Mangli) తన మీద జరిగిన దాడిపై స్పందించింది. ఇటీవల బళ్లారి (Ballari)లో ఓ కార్యక్రమంలో తన కారు (car) పై దాడి అని జరిగిన ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. కర్ణాటక(Karnataka)లోని బళ్లారిలో బళ్లారి ఫేస్ట్ కు సింగర్ మంగ్లీ హాజరైంది. అయితే ప్రోగ్రామ్ అయిపోయాక తిరిగి వస్తుండగా ఆమె కారుపై దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై గాయని స్పందించింది. ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేసింది. వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. తనపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా(Social Media) గ్రూపులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడింది.

బళ్లారి ఈవెంట్(Ballari Event) సక్సెస్ అయిందని, తాను చేసిన ఉత్తమ ఈవెంట్లలో ఇది ఒకటని మంగ్లీ తెలిపింది. కన్నడ ప్రజలు(Kannada People) తనపై అపారమైన ప్రేమను చూపించారని చెప్పుకొచ్చింది. కార్యక్రమంలో తనను బాగా చూసుకున్నారని వెల్లడించింది. తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలా చేస్తున్నారని ట్వీట్ చేసింది. బళ్లారి ఉత్సవ్ కు మంగ్లీ హాజరైంది. శ‌నివారం రాత్రి కారుపై దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. బళ్లారి(bellary) మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సింగర్ మంగ్లీ(Singer Mangli) పాల్గొంది. కార్యక్రమం అయిపోయాక.. వేదిక నుంచి తిరిగి వెళ్లేప్పుడు కార్యక్రమానికి వచ్చిన కొంతమంది ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారని వార్తలు వైరల్ అయ్యాయి.

బళ్లారి ఉత్సవం (బళ్లారి ఫెస్టివల్) అట్టహాసంగా మెుదలైంది. రెండు రోజుల ఉత్సవాన్ని మంత్రి శ్రీరాములు ప్రారంభించారు. ఉత్సవంలో సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటి రోజు ఉత్సవంలో సింగర్ మంగ్లీ, కొంతమంది గాయకులు పాల్గొన్నారు. శాండిల్ వుడ్ ప్రముఖ యాంకర్ అనుశ్రీ(Anchor Anushree), సంగీత దర్శకుడు అర్జున్ బృందం కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘రాబర్ట్’ సినిమా ద్వారా కన్నడ ప్రేక్షకులకు పరిచయం అయింది మంగ్లీ. జోగి ప్రేమ్ దర్శకత్వంలో ‘ఏక్ లవ్ యా’ చిత్రం తర్వాత కన్నడలో వరుసగా పాటలు పాడే అవకాశాలు వస్తున్నాయి. ‘పుష్ప’ సినిమా(Pushpa Movie) ఊ అంటావా మామ పాటను కన్నడలో మంగ్లీనే పాడింది.

https://www.instagram.com/p/CnuPgt9p5OT/?utm_source=ig_web_copy_link

బళ్లారి (Ballari)లో సింగర్ మంగ్లీ (Mangli) కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. శనివారం రాత్రి బళ్లారిలోని మున్సిపల్ కళాశాల గ్రౌండ్‌లో ‘బళ్లారి ఉత్సవ్’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగ్లీ పాల్గోంది. ఈ కార్యక్రమంలో పాటలు కూడా పాడింది. కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఆమె కారుపై దాడి చేశారు. కన్నడ మాట్లాడలేదంటూ మంగ్లీ కారుపై దాడి చేసిన స్థానికులు చెబుతున్నారు. ఇటీవల చిక్కబళ్లాపూర్‌ (Chikkaballapur)లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంగ్లీ పాల్గొంది. అయితే స్థానిక భాషలో కాకుండా మంగ్లీ తెలుగులో ‘అందరూ బాగుండారా’ అని పలకరించింది. అదే వేదికను పంచుకున్న యాంకర్ అనుశ్రీ ఇక్కడ కన్నడవాళ్లు ఉన్నారు కాబట్టి కన్నడ కూడా మాట్లాడాలని సూచించింది. చిక్కబళ్లాపూర్‌ ఏపీలో సరిహద్దులో ఉంటుంది. అందువల్ల మోజార్టీగా అక్కడి ప్రజలు తెలుగులోనే మాట్లాడుకుంటారు. అందువల్లే ‘‘అనంతపురం ఇక్కడికి దగ్గర్లోనే ఉంది. అందరూ తెలుగు వస్తుంది’’ అనే ఉద్దేశంతోనే తెలుగులో చెప్పానని సంజాయితీ కూడా ఇచ్చింది. మంగ్లీ తెలుగులో మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social media)లో వైరల్‌ అవుతున్నాయి. కొందరు మంగ్లీ తీరును తప్పుబడుతున్నారు. మంగ్లీ కన్నడ ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్లయిందని ఆమెకు కన్నడం అర్థం కదా అని ప్రశ్నిస్తున్నారు. కర్నాటక (Karnataka)కు వచ్చి కన్నడలో మాట్లాడపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

(US Visa for Indians :అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్!)

చివరగా కన్నడ ప్రజలు తనపై అపారమైన ప్రేమను చూపించారని చెప్పిన మంగ్లీ.. ఈవెంట్‌లో తనను బాగా చూసుకున్నారని చెప్పారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలా చేస్తున్నారని మంగ్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బళ్లారి మున్సిపల్ కాలేజీ గ్రౌండ్స్ (Bellary Municipal College Grounds)లో ఏర్పాటు చేసిన బళ్లారి ఉత్సవకు మంగ్లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ లో పాటలు పాడి- ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమానికి కన్నడ నటుడు రాఘవేంద్ర రాజ్ కుమార్, (Raghavendra Rajkumar is a Kannada actor) ఆయన తమ్ముడు దివంగత పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని రాజ్ కుమార్ (Puneeth Rajkumar’s wife is Ashwini Rajkumar) ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో మంగ్లీ కన్నడలో మాట్లాడలేదనే అసహనంతో కొందరు ఆమెపై దాడికి యత్నించారని వార్తలు వచ్చాయి. ఆమె కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని ప్రచారం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు రావడంతో చివరకు మంగ్లీ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -