end
=
Tuesday, August 12, 2025
సినీమామిడిల్ ఏజ్ బ్యాచిలర్.. ప్రేమకథలు
- Advertisment -

మిడిల్ ఏజ్ బ్యాచిలర్.. ప్రేమకథలు

- Advertisment -
- Advertisment -

టాలీవుడ్ హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ సినిమా ‘సుందరకాండస‌. డెబ్యూ దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ ఎస్ పీపీ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ నెల 27న చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఇటీవ‌ల‌ విడుదలైన సినిమా టీజర్, పాటలు ఇప్పటికే సోష‌ల్ మీడియాలో బ‌జ్ సాధించాయి. పాన్ ఇండియ‌న్ స్టార్‌ ప్రభాస్ ఇటీవ‌ల చిత్రం ర్యాప్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఓ మిడిల్ ఏజ్ బ్యాచిలర్ తన లైఫ్ పార్ట్‌నర్‌లో ఉండాల్సిన అయిదు క్వాలిటీస్ కోసం సెర్చ్‌ చేయడం చుట్టూ ఈ కథ తిరుగుతుంద‌ని తెలిసింది. ఈ జర్నీలో అతని కాలేజి డేస్ లవ్ స్టోరీ, ప్రజెంట్ లవ్ స్టోరీ.. ఇలా రెండు ప్రేమకథలతో హిలేరియస్ గా సాగింది. డైరెక్టర్ వెంకటేశ్ రాసిన సీన్‌లు క్రిస్ప్‌గా, సిట్యుయేషనల్ కామెడీ, ఎమోషనల్ బీట్స్‌కి స్మార్ట్ బ్యాలెన్స్ చేశాయి. ట్రైలర్ హిలేరియస్ గా ఉంది. వెండితెర‌పై చిత్రం ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -