end
=
Wednesday, May 7, 2025
వార్తలురాష్ట్రీయంఖమ్మంలో ‘మియాజాకి’ మామిడి.. కిలో రూ.2.5 లక్షలు
- Advertisment -

ఖమ్మంలో ‘మియాజాకి’ మామిడి.. కిలో రూ.2.5 లక్షలు

- Advertisment -
- Advertisment -

ప్రపంచంలో ఖరీదైన మామిడి ఇదే..

మియాజాకి మామిడి పండు(Miazaki Mango Fruit).. ఊదారంగు(Purple color)లో ఉండే ఈ మామిడికి ఉన్న డిమాండ్ (Huge Demand)అంతా ఇంతా కాదు. వీటి కాస్ట్‌ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బాబోయ్ మామిడి పండ్లు ఇంత ధర ఉంటుందా? అని ఆశ్చర్యపోక తప్పదు. కిలో మియాజాకి మామిడి పండ్లు వంద కాదు వెయ్యి కాదు.. ఏకంగా రూ. 2.5 లక్షల ధర పలుకుతాయి.

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలానికి(Khammam rural mandal) చెందిన గరికపాటి వెంకట్రావ్ తన వ్యవసాయ క్షేత్రంలో ఈ రకం మామిడి తోట పెంచుతున్నారు. 2020లో కరోనా సమయంలో బెంగళూరు నుంచి ఆయన 10 మొక్కలు తెప్పించారు. ఒక్కో మొక్కకు రూ.10 వేల చొప్పున వెచ్చించారు. గత సంవత్సరం ఒక్కొ చెట్టుకు 30 పండ్లు, ఈ సంవత్సరం ఒక్క చెట్టుకు 80 కాయలు కాశాయి. ఫలసాయం బాగుందని భావించిన సదురు రైతు ఏపీలోని కడియం నుంచి మరో 58 మొక్కలను తెప్పించి నాటారు.

ఇంతకీ ఈ మామిడికి ఎందుకంత క్రేజ్​ అంటే.. పండు ఈ తింటే కేన్సర్‌ రిస్క్‌ తగ్గుతుందని, టేస్ట్‌లోనూ దీనికి సరిసాటి మరో పండు ఉండదంటున్నారు. వాస్తవానికి ఈ రకం మామిడిపండ్లు జపాన్​లో పండుతాయి. ముఖ్యంగా మియాజాకి ప్రాంతం ఈ రకం తోటలకు చాలా ఫేమస్​. అందుకే ఈ మామిడికాయలకు మియాజాకి అని పేరొచ్చింది. మియాజాకి మామిడి రంకం మన నేలలకు సైతం అనువైందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -