బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి హరీష్
ఎం ఎం కీరవాణి.. పేరు చెప్పగానే గ్రేట్ మ్యూజీషియన్ మన కళ్ల ముందు సాక్ష్యాత్కరిస్తాడు. ఆయన సృష్టించిన పాటలు అనేకం. ఎన్నో మధురగేయాలు, మృదుమధుర కావ్యాలు. చాలా సినిమాలకు సంగీతం అందించిన ఈ సంగీతసృష్టికర్త.. పోలీసుల సేవను కొనియాడుతూ, వారి కష్టాన్ని తెలియజేసేలా ఓ అద్భుతమైన పాటను పాడారు. ఈ పాటను ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ రాశారు.
ONGCలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఎవరికైనా ప్రమాదంలో ఉన్నామనిపిస్తే వెంటనే గుర్తుకొచ్చే వ్యక్తి పోలీస్. సమాజం బావుండటం కోసం పోలీసులు చేసే సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. లాక్‌డౌన్ సమయంలో వారు చేసి పని, అలాగే ప్లాస్మాను దానం చేయాలని ప్రజలకు పిలుపునిస్తూ వారు చేసిన కృషి వాటికి మచ్చు తునకలు.’పోలీస్ పోలీస్.. తెలంగాణ పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్’ పాటను డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ విడుదల చేశారు.
అక్టోబర్ 21 నుంచి 31 వరకు నిర్వహించిన పోలీస్ ఫ్లాడ్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేయడం సందర్భోచితంగా ఉందని డీజీపీ తెలిపారు. డ్యూటీ చేసే సమయంలో పోలీసులు ఎదుర్కొనే సమస్యలను ఆయన ఈ సందర్భంగా వివరిస్తూనే.. పోలీసుశాఖ అందించిన సేవలను కొనియాడారు. ఆ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ఎం.ఎం.కీరవాణి పాల్గొన్నారు.