- నన్ను 139మంది రేప్ చేయాలేదు
- మీడియా సమావేశంలో బాధితురాలు
వెబ్ డెస్క్ : తనపై 139మంది రేప్ చేసారని ఓ యువతి ఇటీవల పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం రాష్ర్టం మొత్తం సంచలనం సృష్టించగా.. ఆమె ఇచ్చిన లిస్టులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు పేర్లు కూడా ఉండటం సినీ ఫీల్డ్‌లో చర్చకు దారి తీసింది. తనను సామూహికంగా లైంగికదాడికి పాల్పడి, నగ్నంగా వీడియోలు తీసి చిత్రహింసలకు గురిచేశారని ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు పోలీసులు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన తరువాత సదరు యువతి మాట మార్చింది.
Paytm డేటా సర్వర్లపై హ్యాకర్లు దాడి
ఈ కేసుతో యాంకర్ ప్రదీప్‌కి గానీ, నటుడు కృష్ణుడికి గాని ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బాధితురాలు ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ డాలర్ బాయ్ అనే వ్యక్తి చెప్పమనడంతోనే తాను 139మంది పేర్లతో ఫిర్యాదు చేశానని తెలిపింది. ఇందులో చాలా మందికి సంబంధం లేదని డాలర్‌బాయ్ టార్చర్ పెట్టి, చంపేస్తానని బెదిరించడంతో ఈ కంప్లెంట్ ఇచ్చాని యువతి పేర్కొంది. ఈ కేసుతో సంబంధం లేని వాళ్లందరికీ క్షమాపణలు కోరుతున్నాని తెలిపారు. వారి నుంచి డబ్బులు గుంజడానికే డాలర్ బాయ్ ఈ కుట్ర పన్నినట్లు పేర్కొన్నది.
బాధితురాలికి అండగా కుల సంఘాలు
బాధితురాలికి అండగా నిలిచిన వివిధ కుల సంఘాలు, మహిళా సంఘాలు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ‘ఇటువంటి ఘటన చూస్తే పూలన్ దేవి గుర్తొచ్చింది. ఫూలన్ దేవి ఎన్నోసార్లు అఘాయిత్యానికి గురయ్యారు. పీడిత కులానికి చెందిన యువతిపై 139 దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసి షాక్‌కి గురయ్యాను. ఈ కేసుకు సంబంధించి సీసీఎస్ పోలీసులను మా బృందం సంప్రదించింది. ఒక మహిళా ఏసీపీ కేసును విచారిస్తున్నరని తెలిపారు. కేసును సీఐడీకి బదిలీ చేయాలని కోరుతున్నాం. నిన్న సుమారు రెండు గంటల పాటు బాధితురాలితో మాట్లాడాను. ఈ కేసులో నిజాలు తెలుసుకునేందుకు బాధితురాలికి పోలీసుల కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగాను. పెళ్లైన తరువాత అమ్మాయి జీవితంలో జరిగిన నాలుగు ఘటనలు వివరించింది.
దళిత రైతులపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
139 మందిలో 30 శాతం మంది అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశారు. ఇంకో 30శాతం అమ్మాయిని మానసికంగా వేధించి బ్లాక్ మెయిల్ చేశారు. అమ్మాయి చిన్న వయసులోనే బ్లాక్ మెయిల్కు గురై అత్యాచారానికి గురైంది. ఎస్‌ఎఫ్‌ఐ మీసాల సుమన్ ఈ అమ్మాయి జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడే అమ్మాయి బ్లాక్ మెయిల్‌కు గురైంది. డాలర్ బాయ్ అమ్మాయితో కేసులు పెట్టించి వారిని బ్లాక్‌మెయిల్ చేశాడు. డాలర్ బాబు కూడా అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మీసాల సుమన్, డాలర్ బాయ్‌ను అదుపులోకి తీసుకుంటే అన్ని నిజాలు బయట పడుతాయి. బాధితురాలికి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలి’ అని మందకృష్ణ పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో డాలర్ బాయ్
రాజాశ్రీకర్‌రెడ్డి ఆలియాస్ డాలర్‌బాయ్ టాస్కుఫోర్సు అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 139మంది చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలు కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు ఓ వైపు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో అతడు ఎవరన్న కోణంలో దర్యాప్తు ప్రారంభిచారు.