end
=
Thursday, July 31, 2025
సినీమానిధి జాక్​పాట్​.. ఆ హీరో సరసన డాన్స్​
- Advertisment -

నిధి జాక్​పాట్​.. ఆ హీరో సరసన డాన్స్​

- Advertisment -
- Advertisment -

టాలీవుడ్‌ (Tollywood)లో నిధి అగర్వాల్ (Nidhi Agarawal) దశ తిరిగినట్టు (Swings On) కనిపిస్తున్నది. పవర్ స్టార్  (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సరసన మరో బంపర్ ఆఫర్‌ (Bumper Offer)ను దక్కించుకున్నట్టు సమాచారం. నిన్నమొన్నటి వరకు ‘హరిహర వీరమల్లు’ సినిమాలో తన నటనతో పవన్ అభిమానులను ఆకట్టుకున్న నిధి, ప్రమోషన్ల సమయంలోనూ అంకితభావం చూపించారు.

దీంతో పవన్ కల్యాణ్ ఫిదా అయ్యారట. నిధి కేవలం ఒకరోజులోనే ఏకంగా 16 మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రతి ప్రచార కార్యక్రమానికి హాజరు కావడం పవన్​ను మెప్పించింది. అందుకే ఆమెకు మరో అవకాశం ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ ప్రస్తుతం నటిస్తున్న ఓజీ సినిమా(OG Movie)లో నిధికి ఒక స్పెషల్ సాంగ్‌లో తనతో డాన్స్​ చేసే అవకాశం కల్పిస్తున్నారని తెలిసింది.

సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఓజీ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. చిత్రంలో ఇంకా ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉందని, ఆ స్పెషల్ సాంగ్‌లోనే నిధి సందడి చేయబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ నిధి కెరీర్‌కు మంచి బూస్టింగ్ ఇస్తుందని, పవన్ అభిమానులను ఉర్రూతలూగిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -