end
=
Wednesday, August 13, 2025
రాజకీయంకేంద్ర మంత్రి `బండి`కి నోటీసులు
- Advertisment -

కేంద్ర మంత్రి `బండి`కి నోటీసులు

- Advertisment -
- Advertisment -

త‌నపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేంద్ర మంత్రి బండి సంజ‌య్ ఆరోప‌ణ‌లు చేశార‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం ఈ మేర‌కు బండి సంజయ్‌కి లీగల్ నోటీసు పంపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఒక కేంద్ర మంత్రిగా బాధ్యతారహితంగా వ్యవహరించారని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే క్రిమినల్ చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కేటీఆర్‌ హెచ్చరించారు. ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన తర్వాత బండి సంజయ్, కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ, రాజకీయ నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని నోటీసు ద్వారా తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -