end
=
Monday, January 26, 2026
సినీమా‘కాంతార 3’లో ఎన్టీఆర్?
- Advertisment -

‘కాంతార 3’లో ఎన్టీఆర్?

- Advertisment -
- Advertisment -

‘కాంతార’ (Kantara Movie)అనే ఒక ప్రాంతీయ చిత్రం 2022లో దేశవ్యాప్తంగా ఒక ఊపు ఊపింది. రిషబ్ శెట్టి (Rishab Setty) దర్శకత్వం (Director) వహించడమేకాక ఆ సినిమాలో లీడ్​ రోల్​ నటించి, యావత్​ దేవ ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు త్వరలో సినిమాకు రెండో భాగం రాబోతున్నది. ఈ చిత్రంలో ఇంకా సెట్స్‌పైనే ఉండగానే (Movie on Sets) మూడో భాగం గురించి ఆసక్తికర చర్చ జరుగుతున్నది.

ఎందుకంటే చిత్రంలో రిషబ్ శెట్టితోపాటు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం ఊపందుకున్నది. కాంబినేషన్ (Crazy Combination) కుదిరితే మాత్రం కచ్చితంగా చిత్రం పాన్-ఇండియా స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. గతంలో ఎన్టీఆర్ తన తల్లి షాలినితో కలిసి బెంగళూరులోని ఓ ఆలయాన్ని సందర్శించారు.

అప్పుడు రిషబ్‌శెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఆ సందర్భంలోనే రిషబ్.. ఎన్టీఆర్‌తో ‘కాంతార-3’ కథపై చర్చించారనేది తాజాగా జరుగుతున్న చర్చ. ఎన్టీఆర్‌కు కథ బాగా నచ్చిందని, అందుకే ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఎన్టీఆర్ తల్లి కర్ణాటకలోని కుందాపూర్‌కు చెందిన వారు కావడం, ‘కాంతార’లో చూపించిన కోలా ఆచారం ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉండటం కూడా కాంబో కుదరడానికి కారణమని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.

సీక్వెల్‌లో ఎన్టీఆర్‌ది కేవలం క్యామియో రోల్ కాదని, కథలో కీలకమైన పాత్రలో కనిపించే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వుర్ ఇండియా’ కవర్ పేజీలో ఎన్టీఆర్ ఫొటోలు మొదటిసారి కనిపించడంతో అభిమానులు వాటిని సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -