పబ్‌లో అర్ధనగ్న నృత్యాలు(Obscenity Dance) చేస్తున్న 16 మంది యువతుల(Adult Female)ను పోలీసులు అరెస్టు(Arrested) చేశారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిల్లా మైసమ్మ ఆలయ సమీపంలో ఉన్న వైల్డ్ హార్ట్ క్లబ్(Wild Heart Club)పై సోమవారం రాత్రి 9 గంటల సయంలో పోలీసులు తనిఖీలు(Police Rides) నిర్వహించారు. సమయానికి మించి పబ్ నడుపుతుండటంతోపాటు యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లని(Customers) ఆకట్టుకునేలా ముంబై నుంచి యువతులను తీసుకొచ్చినట్టు గుర్తించారు. మొత్తం 16 మంది యువతులు, డీజే నిర్వాహకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. బారు ఓనర్, మేనేజర్ సంతోష్ పరారీలో ఉన్నారని చైతన్యపురి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇదిలా ఉండగా పబ్బు యజమాని రాము.. యువతులను ఫ్రీ ఎంట్రీ పేరు మీద ఎంగేజ్ చేసుకుని పబ్బుకు ఒంటరిగా వచ్చే యువకుల దగ్గరికి వెళ్లి వారితో అసభ్యంగా డాన్సులు చేయిస్తున్నట్టు తెలిసింది. ఆ మత్తులో మద్యం ఎక్కువగా తాగేలా చేసి బిల్లు అధికంగా అయ్యేలా చేసి కస్టమర్లను మోసం చేస్తున్నాడని సమాచారం.
- Advertisment -
పబ్బులో అశ్లీల నృత్యాలు.. బాబోయ్ అంతమంది అరెస్టా ?
- Advertisment -
- Advertisment -
- Advertisment -
- Advertisment -
- Advertisment -