end
=
Thursday, May 16, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంOnion:ఉల్లితో గుండెకు ప్రమాదమే..
- Advertisment -

Onion:ఉల్లితో గుండెకు ప్రమాదమే..

- Advertisment -
- Advertisment -
  • అతిగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు
  • ఆఫ్రికన్ హెల్త్ సైన్సెస్‌ ఆధ్యయనం వెల్లడి

ఉల్లి (onion) చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కానీ అది అన్ని సందర్భాల్లో ప్రమాదకరమే (danger). అందుకే మీ ఆహారంలో ఉల్లిపాయలను చేర్చే అలవాటుంటే మంచిదే కానీ అతిగా తీసుకోవడం మూలంగా ఆరోగ్యం పాడవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఉల్లి కారణంగా కలిగే సైడ్ ఎఫెక్ట్స్ (Side effects)పట్ల జాగ్రత్తగా ఉండాలని.. వాటి దుష్ప్రభావాలను వివరిస్తున్నారు.

అలెర్జీలు: (Allergies)

ఫుడ్ అలర్జీస్ (Food allergies) చాలా సాధారణం. ఉల్లిపాయలతో సహా ఏదైనా కారణంగా సంభవించవచ్చు. రోగనిరోధక వ్యవస్థ (immune system)కొన్ని ఆహారాలలోని ప్రోటీన్‌ (proteins)లకు ప్రతిస్పందించినప్పుడు ఈ అలెర్జీలు సంభవిస్తాయి. ఆఫ్రికన్ హెల్త్ సైన్సెస్‌ (African Health Sciences)లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆస్పరాగస్, లీక్స్ (Onions, garlic, asparagus, leeks)అనేవి లిలియాసి (Liliaceae)కుటుంబానికి చెందినవి. ఇవి అలెర్జీ క్రాస్-రియాక్టివిటీ (Allergic cross-reactivity)కి కారణమవుతాయి. అంటే వీటిలో దేనికైనా అలర్జిక్‌గా ఉన్నట్లయితే.. అవి మీలో అలెర్జీని డెవలప్ (devolop)చేయవచ్చు.

గుండెల్లో మంట: (heartburn)

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ (National Institute of Diabetes and Digestive and Kidney Diseases) గుండెల్లో మంటను గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) లక్షణంగా నిర్వచించింది. న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్ జర్నల్‌ (Journal of Nutrition and Cancer)లో ప్రచురించబడిన 2000 అధ్యయనం ఉల్లిపాయతో సహా కొన్ని ఆహారాలు గుండెల్లో మంట (heartburn)లక్షణాలను ప్రేరేపిస్తాయి.

కంటి సమస్యలు: (Eye problems)

ఉల్లిపాయలు కోసేటప్పుడు ఎప్పుడైనా మీ కళ్లలో (EYES)కుట్టినట్లు అనిపించిందా? ఉల్లిపాయలను కత్తిరించేటప్పుడు సల్ఫర్ మెటాబోలైట్ (sulfur metabolite) ఒక రూపం అయిన లాక్రిమేటరీ ఫ్యాక్టర్ (Lachrymatory factor)విడుదలవడం మూలంగా ఇది జరుగుతుంది. LF కళ్లకు చేరినప్పుడు చికాకును కలిగిస్తుంది, ఉల్లిపాయ కన్నీటిని ప్రేరేపించే ప్రభావానికి దారితీస్తుంది.

(Smoking:మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతున్న స్మోకింగ్..)

ప్రకోప ప్రేగు సిండ్రోమ్: (Irritable Bowel Syndrome:)

IBS అనేది ఒక సాధారణ జీర్ణశయాంతర సమస్య (Gastrointestinal problem). ఇది తీవ్రమైన, బాధాకరమైన ఉదర లక్షణాలను కలిగిస్తుంది. ఆహారాలు ఖచ్చితంగా IBSకి కారణం కానప్పటికీ, FODMAP డైట్‌లోని ఫుడ్స్( ఫెర్మెంటబుల్ ఒలిగో-, డి-, మోనోశాకరైడ్లు మరియు పాలియోల్స్) (fermentable oligo-, di-, monosaccharides and polyols) దాని లక్షణాలను ప్రేరేపించగలవు. ఈ జీర్ణం కానీ, నెమ్మదిగా శోషించబడే షార్ట్-చైన్ కార్బోహైడ్రేట్ల (Short-chain carbohydrates) వలన IBS బాధితులు అసౌకర్యాన్ని అనుభవిస్తారు.

దుర్వాసన: (Odor)

దుర్వాసన అనేది మిమ్మల్ని ఆశ్చర్యపరచని ఒక సైడ్ ఎఫెక్ట్ (Side effect). ఉల్లిపాయ వల్ల కలిగే అత్యంత సాధారణ, తక్షణ దుష్ప్రభావాలలో నోటి దుర్వాసన కూడా ఒకటి. వైద్యపరంగా దీన్ని హాలిటోసిస్ (Halitosis) అని పిలుస్తారు

(Brass and Copper vessels: ఇత్తడి, రాగి పాత్రల్లో వంట మంచిదేనా..?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -