end
=
Wednesday, May 15, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంBrass and Copper vessels: ఇత్తడి, రాగి పాత్రల్లో వంట మంచిదేనా..?
- Advertisment -

Brass and Copper vessels: ఇత్తడి, రాగి పాత్రల్లో వంట మంచిదేనా..?

- Advertisment -
- Advertisment -

ఈ రోజుల్లో ఇత్తడి (Brass) రాగి (copper)పాత్రలలో వంట (cooking) చేయడం చాలా తగ్గిపోయింది. కానీ, ఈ పాత్రలు మన ఆహారంలో పోషక విలువలు (Nutritional values ​​in food) పెంచి, ఆరోగ్య ప్రయోజనాలను (Health benefits) అందించడంలో గొప్పగా పనిచేస్తాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సౌకర్యవంతమైన స్టీల్, గ్లాస్, నాన్-స్టిక్ కుక్‌వేర్స్‌ (Steel, glass, non-stick cookware)ను ఉపయోగిస్తున్నారు. కానీ రాగి, ఇత్తడి పాత్రల్లో వంట చేసినా లేదా వాటిని తినడానికి ఉపయోగించినా థెరపాటిక్ బెనిఫిట్స్ (Therapeutic benefits) కలుగుతాయి. ఉడికించడం మూలంగా కలిగే పోషకాల నష్టాన్ని నిరోధించడమే కాకుండా బలాన్ని, రోగనిరోధక శక్తి  (Immunity)ని పెంచుతాయి.

ప్రయోజనాలు : (Benefits)

ఆస్తమాకు మంచిది : (Good for asthma)

ఇత్తడి పాత్రలో వండిన ఆహారాన్ని తీసుకోవడం లేదా అందులో భద్రపరిచిన నీటిని తాగడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధుల చికిత్స (Treatment of respiratory diseases)లో సహాయపడుతుంది.

హిమోగ్లోబిన్ కౌంట్ (Hemoglobin count) పెంచుతుంది :

ఇత్తడి పాత్రలలో వండటం వల్ల ఆహారంలోకి జింక్ (Zinc is released) విడుదల అవుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి (Purify the blood) చేయడంలో సహాయపడటమే కాకుండా హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది.

ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది: (Reduces the risk of infections by)

రాగి మరియు ఇత్తడితో చేసిన పాత్రలు ఆహారాన్ని ఎక్కువ కాలంపాటు వెచ్చగా ఉంచుతాయి. అదే సమయంలో వ్యాధులు,  ప్రమాదకరమైన సూక్ష్మజీవుల (Microorganisms)నుంచి రక్షిస్తాయి. అంతేకాక ఈ పాత్రలు అందంగా కనిపిస్తూ.. వంటింటికి (kitchen) గొప్ప కళను తీసుకొస్తాయి. 

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం: (Relief from joint pain)

యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను (Anti-inflammatory properties)కలిగిన రాగి పాత్రలలో నీటిని తాగడం వలన కీళ్ల నొప్పులు, వాపులు (Joint pains and swelling)తగ్గుతాయి. ఇది జీవక్రియ (Metabolism)ను వేగవంతం చేస్తుంది, శరీరంలో కొల్లాజెన్ (Collagen)స్థాయిలను పెంచుతుంది.

బరువు తగ్గడంలో సహాయం: (weight loss)

ఇత్తడి , రాగి పాత్రలతో వండటం, తినడం వల్ల ఊబకాయం (obesity) తగ్గుతుంది. కంటి చూపు (eye sight)ను మెరుగుపరుస్తుంది. మెలనిన్ ఉత్పత్తి (Melanin production)చేస్తుంది. హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతూ స్కిన్‌ హెల్త్‌ (Skin health)లో కీలకంగా మారుతుంది. 

మెరుగైన జీర్ణక్రియ: (Better Digestion)

గ్యాస్, మలబద్ధకం (Gas, constipation) ఎసిడిటీ (Acidity)ని ఎదుర్కోవడానికి సాయపడే ఇత్తడి, రాగి పాత్రల లక్షణాలు జీర్ణ ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. కడుపుని శుభ్రపరిచి, మనం తినే పోషకాలను గ్రహించడంలో సహాయపడుతాయి.

హృదయానికి అనుకూలమైనది: (Heart friendly)

ఈ రోజుల్లో హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కనుక రక్తపోటు, హృదయ స్పందన రేటు (heart rate)ను నియంత్రించడంలో సహాయపడే రాగి పాత్రలను వంటకు ఉపయోగించడం మంచిది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ (Bad cholesterol)తో పోరాడి, రక్తపోటు (blood pressure)ను తగ్గిస్తుంది.

(Mental Laziness: తన భావోద్వేగాలను చెప్పలేని పరిస్థితి)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -