end
=
Wednesday, July 16, 2025
రాజకీయంరాజభవన్‌కు ఆర్డినెన్స్
- Advertisment -

రాజభవన్‌కు ఆర్డినెన్స్

- Advertisment -
- Advertisment -

బీసీ రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ

వెనుక బడిన (బీసీ) వర్గాల రిజర్వేషన్ల (BC reservations) విషయంలో తెలంగాణ(Telangana State)లో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్థానిక సంస్థల ఎన్నిక (Local Body Election)ల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రప్రభుత్వం (State Government) రూపొందించిన ముసాయిదా గవర్నర్​ (Governor) అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌(Raj Bhavan)కు చేరింది. పంచాయతీరాజ్ చట్టం‌‌ 2018లో సవరణల ఆమోదం కోసం సర్కార్ ఆ ఆర్డినెన్స్​ను​ మంగళవారం పంపింది.

చట్టంలోని సెక్షన్ 285 క్లాజ్ (ఎ)లో 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని రాసి ఉన్న దానిని తొలగిస్తూ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం ఉద్దేశం. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు ఇచ్చిన గడవు మరో రెండు నెలల్లో సమీపిస్తున్నందున.. సర్కార్​ ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. పంచాయతీరాజ్ శాఖ ఈ ఫైలును న్యాయశాఖ ఆమోదించిన తర్వాత సీఎం రేవంత్​ రెడ్డి, క్యాబినెట్​ మంత్రుల ఆమోదంతో రాజ్‌భవన్‌కు ముసాయిదాగా పంపించింది.

గవర్నర్​ ఆమోదం పొందితే చట్టసవరణ..
గవర్నర్ ఆమోదం పొందితే ఇక చట్టసవరణ అమలులోకి రానుంది. అందుకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫార్స్ చేయనున్నది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించనుంది. పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టుకు గడువు విధించిన విషయం తెలిసిందే.

హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండటంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్‌ గవర్నర్‌ ఆమోదం పొందిన తర్వాత, డెడికేటెడ్‌ కమిషన్‌ తుది నివేదిక ఇచ్చిన తర్వాత ఈనెల చివరిలోపు జీవో విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నది.

డెడికేటెడ్‌ కమిషన్‌ కీలక పాత్ర
నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా డెడికేటెడ్‌ కమిషన్‌ ఇప్పటికే నివేదిక ఇచ్చినప్పటికీ, చట్టానికి కొత్త సవరణల ప్రకారం గణాంకాలతో మరో నివేదిక ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నివేదిక వచ్చిన వెంటనే వారం రోజుల్లోపు జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు విషయంలో కొన్ని రాష్ట్రాలు న్యాయపరమైన సమస్యలు ఎదురొన్నాయి.

ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్ల ప్రక్రియను అత్యంత సున్నితంగా ముందుకు తీసుకెళ్లాలని సర్కార్​ భావిస్తున్నది. మున్ముందు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నది. చట్ట సవరణను ఇక కోర్టులు కూడా తప్పపట్టేందుకు వీలు లేకుండా జాగ్రత్త వహిస్తున్నది. ఈ ప్రక్రియ పూర్తయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని బీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీసీలకు పెద్ద ఎత్తున కొత్త సీట్లు దక్కుతాయని భావిస్తున్నాయి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -