end
=
Saturday, January 10, 2026
వార్తలురాష్ట్రీయంప్రణయ్ పరువు హత్య కేసు.. హైకోర్టు కీలక తీర్పు
- Advertisment -

ప్రణయ్ పరువు హత్య కేసు.. హైకోర్టు కీలక తీర్పు

- Advertisment -
- Advertisment -

Miryalaguda: తెలంగాణ(Telangana)లో తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసు(Pranay Murder Case)లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు శ్రవణ్‌కుమార్‌(Shravan Kumar)కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు అదే మొత్తానికి ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, బెయిల్‌పై బయట ఉన్న సమయంలో ఎలాంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనరాదని స్పష్టమైన ఆంక్షలు విధించింది. ఈ కేసులో 2025 మార్చి నెలలో నల్గొండ జిల్లా కోర్టు శ్రవణ్‌కుమార్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ శ్రవణ్‌కుమార్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

తనపై విధించిన శిక్షపై దాఖలైన అప్పీల్ విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం, నిందితుడి వయసు, ఇప్పటికే గడిపిన జైలు జీవితం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరుకు అంగీకరించింది. ప్రణయ్ హత్య ఘటన 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకుంది. పెరుమాళ్ల ప్రణయ్‌ను అతని మామ మారుతీరావు సుపారీ ఇచ్చిన గ్యాంగ్ పగటి పూట ప్రజల మధ్యనే దారుణంగా హత్య చేసింది. కులాంతర వివాహమే ఈ హత్యకు ప్రధాన కారణంగా విచారణలో తేలింది. మారుతీరావు కుమార్తె అమృత, ప్రణయ్‌ను ప్రేమించి వివాహం చేసుకోవడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది.

సుదీర్ఘ విచారణ అనంతరం నల్గొండ జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రణయ్‌ను నేరుగా హత్య చేసిన సుభాశ్ శర్మకు (ఏ-2) ఉరిశిక్ష విధించగా, అమృత బాబాయి అయిన శ్రవణ్‌కుమార్‌తో పాటు ఇతర నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించింది. పరువు హత్యలపై కఠిన సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తీర్పు అప్పట్లో ప్రశంసలు పొందింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు శ్రవణ్‌కుమార్‌కు బెయిల్ లభించడం మరోసారి ఈ కేసును వార్తల్లోకి తీసుకొచ్చింది. బాధిత కుటుంబంతో పాటు సామాజిక వర్గాల్లో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పీల్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఈ అంశం చర్చనీయాంశంగానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -