end
=
Saturday, July 12, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంపిల్లల ఆరోగ్యానికి ప్రోటీన్ పౌడర్
- Advertisment -

పిల్లల ఆరోగ్యానికి ప్రోటీన్ పౌడర్

- Advertisment -
- Advertisment -

మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రోటీన్​ పౌడర్​ (Protein Powder), ప్రాసెస్డ్ డ్రింక్స్‌ (Processed Drinks)తో పోలిస్తే, మనం మన వంటింట్లో తయారు చేసుకునే (Home made powder) ఈ బాహుబలి ప్రోటీన్ పౌడర్ 100 రేట్లు శ్రేష్ఠమైనది, పూర్తిగా సహజమైనది(Natural food). ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, పిల్లలను బలంగా మారుస్తుంది. ఈ పౌడర్‌ను పిల్లలు ఇష్టంగా తాగుతారు.

అవసరమైన పదార్థాలు (wanted ingredients)
బాదం – 100 గ్రాములు
కాజూ – 100 గ్రాములు
వేరుశనగలు – 100 గ్రాములు
సొయాబీన్ – 100 గ్రాములు

ఓట్స్ – 100 గ్రాములు
జీడిపప్పు – 100 గ్రాములు
ఎండు ద్రాక్ష లేదా ఖర్జూరం – 50 గ్రాములు
వాల్ నాట్ – 100 గ్రాములు
పుచ్చగింజలు – 100 గ్రాములు

గుమ్మడి గింజలు – 100 గ్రాములు
వాల్ నట్స్ – 50 గ్రాములు
ఎండు కొబ్బరి తురుము – 50 గ్రాములు
యాలకులు – 5
మిరియాలు – 5

తయారీ విధానం
మొదట అన్ని గింజలను,పప్పు దినుసులను, బాదం, కాజూ, వేరుశెనగలను వేయించి చల్లారనివ్వాలి. ఓట్స్‌ను కూడా తక్కువ మంటపై రెండు నిమిషాలు వేయించి ఉంచాలి. ఈ పదార్థాలను బాగా పొడి చేయగలిగే మిక్సీలో వేసి, మెత్తగా పొడి చేసుకోవాలి. పొడిలో ఎండు ద్రాక్ష లేదా ఖర్జూరం, ఎండు కొబ్బరి తురుము, మరియు జీడిపప్పు పొడి కలిపి మళ్లీ మిక్సీ చేయాలి. చివరగా, స్వాసన కోసం ఎలకల పొడిని చేర్చాలి. పొడిని సీల్డ్ కంటైనర్‌లో నిల్వ చేయాలి.

తీసుకునే విధానం
ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీటిలో రెండు టేబుల్ స్పూన్లు బాహుబలి ప్రోటీన్ పౌడర్ కలిపి తాగవచ్చు.
శరీరానికి కావాల్సిన శక్తి మరియు ప్రోటీన్లను అందించడంలో ఇది సహాయపడుతుంది.

పౌడర్ ఉపయోగాలు
శక్తి పెంపు: శరీరానికి తక్షణ శక్తిని అందించి రోజువారీ కార్యకలాపాలకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
మేధస్సు మెరుగుదల: పిల్లల దృష్టి, జ్ఞాపకశక్తి, మరియు మెదడుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.
కండరాల బలవృద్ధి: శరీర కండరాలను బలపరచి, శక్తి మిగిలించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి పెంపు: శరీరానికి సహజ రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పౌష్టికతతో నిండిన ఆహారం: సమతుల ఆహారంగా పనిచేసి, పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ అనువైనది.

ఆయుర్వేద వైద్యుడు
డాక్టర్​ వెంకటేశ్​
9392857411

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -