end
=
Monday, August 18, 2025
సినీమా‘పుష్ప’ జాలిరెడ్డి.. ఆ పాత్రలో
- Advertisment -

‘పుష్ప’ జాలిరెడ్డి.. ఆ పాత్రలో

- Advertisment -
- Advertisment -

కన్నడ నటుడు డాలీ ధనంజయ(Actor Dhananjaya), సప్తమి గౌడ (Actress ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హలగలి’. ఇది కర్ణాటకలోని ఒక గ్రామం పేరు. ఆ పేరుతోనే సినిమా టైటిల్‌ను నిర్ణయించారు. బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా హలగలి గ్రామ ప్రజలు చేసిన చారిత్రక పోరాటం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ పోరాటం కన్నడ పదవ తరగతి పాఠ్యపుస్తకంలో కూడా ఒక అధ్యాయంగా ఉంది. వేట ప్రధాన వృత్తిగా జీవించే హలగలి ప్రజలు కత్తులు, గొడ్డళ్లతో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడారు. అయితే, బ్రిటిష్‌వారి తుపాకీలకు ఎదురునిలవలేక ప్రాణాలు కోల్పోయారు. ఈ సినిమాను దర్శకుడు సుకేశ్ నాయక్ తెరకెక్కిస్తుండగా, కళ్యాణ్ చక్రవర్తి ధూళిపాళ్ల నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల ఆసక్తిని పెంచింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -