end
=
Tuesday, September 16, 2025
సినీమాపెదరాయుడు.. పాపారాయుడు.. కన్నప్ప
- Advertisment -

పెదరాయుడు.. పాపారాయుడు.. కన్నప్ప

- Advertisment -
- Advertisment -

కలెక్షన్​ సింగ్ మోహన్​బాబు (Veteran Actor Mohanbabu) జర్నీలో అపురూపమైన చిత్రం ‘పెదరాయుడు’ (Peda rayudu Movie). ఈ చిత్రం విడుదలై జూన్ 15 నాటికి 30 ఏళ్లయింది. ఈ సందర్భంగా మోహన్​బాబు చెన్నైలో తన కుమారుడు విష్ణు(Actor Vishnu)తో కలిసి సూపర్​స్టార్​ రజినీకాంత్ (Super Star Rajinikanth)​ను కలిశారు. మోహన్​బాబు, రజనీకాంత్​ నాటి జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నారు. అనంతరం రజినీకాంత్ ‘కన్నప్ప’ చిత్రాన్ని వీక్షించారు. తర్వాత రజినీకాంత్ తన అభిప్రాయాల్ని పంచుకున్నారు.

సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. విష్ణు నటనలో పరిపక్వత కనిపిస్తుందని కితాబునిచ్చారు. ఈ మేరకు విష్ణు సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘కన్నప్ప’ చిత్రాన్ని రజినీకాంత్ గారు ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన తరువాత నన్ను గట్టిగా హత్తుకున్నారు. ‘కన్నప్ప’ తనకెంతో నచ్చిందని ఆయన అన్నారు.

ఈ క్షణం కోసం నేను గత 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఆ కల ఇప్పుడు నెరవేరింది. నాకు ఈ రోజెంతో ఆనందంగా, సంతోషంగా ఉంది. గర్వంగానూ ఉంది’ అని అన్నారు. మోహన్ బాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘జూన్ 15కి ‘పెద రాయుడు’ రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తయ్యాయి. అదే రోజు నా ప్రియమిత్రుడు రజినీకాంత్ ‘కన్నప్ప’ చిత్రాన్ని వీక్షించారు.

ఆయన తన ఫ్యామిలీతో సహా మూవీని వీక్షించారు. సినిమా చూసిన తర్వాత ఆయన కురిపించిన ప్రేమ, ప్రశంసలు, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను. థాంక్యూ మిత్రమా’ అని అన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -