శూర్పణఖ.. రకుల్​ ప్రీత్​ సింగ్​

17
- Advertisement -

రామాయణం కథాంశం(Ramayana back drop)తో భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్నది. రాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్(Actor Ranbeer kapoor), సీతగా సాయిపల్లవి(Actress Saipallavi), రావణుడిగా కన్నడ స్టార్ యష్​, హనుమంతుడిగా సన్నీడియోల్, కైకేయిగా లారా దత్తా తమ పాత్రలు పోషించనున్నారు. నితేశ్ తివారీ(Director Nithish Tiwari) ప్రతిష్ఠాత్మకంగా దర్వకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

ఈ చిత్రం ఇప్పుడు భారత్​లో హాట్​ టాపిక్​గా మారింది. రెండు భాగాల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలిభాగాన్ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ భావిస్తోంది. రెండో భాగాన్ని 2027లో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ఫిల్మ్‌నగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది.

రావణుడి సోదరి శూర్పణఖ పాత్ర కోసం పలువురు స్టార్ హీరోయిన్లను టీమ్ సంప్రదించగా.. తొలుత అవకాశం ప్రియాంక చోప్రాకు దక్కింది. అయితే, తన చేతిలో ఉన్న ఎస్‌ఎస్‌ఎంబీ29 సహా ఇతర సినిమాలను పూర్తి చేసే క్రమంలో ప్రియాంక ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో ఉందట. దీంతో మేకర్స్ ప్రియాంక స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్‌తో భర్తీ చేయాలని భావించిందట.

ఇదే విషయమై రకుల్‌ను సంప్రదిస్తే వెంటనే ఓకే చేసిందని తెలుస్తోంది. దీంతో రకుల్ లుక్ టెస్ట్ కోసం టీమ్ ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. రకుల్ సినిమాల విషయానికొస్తే.. చివరగా ‘మేరే హస్బెండ్ కీ బీవీ’లో కనిపించింది. ఇంకా ఆమె ‘ఇండియన్3’, ‘దే దే ప్యార్ దే2’ సినిమాలోనూ నటిస్తోంది.

మరి ‘రామాయణ’లో శూర్పణఖగా కనిపించే అదృష్టం రకుల్‌ను వరించిందన్న వార్తల ఎంతవరకు నిజమో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వెలువడేంతవరకు ఆగాల్సిందే.

- Advertisement -