సౌత్, నార్త్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్న అందాల తార(Beatiful Heroine) రష్మిక మందన్న(Rashmika Mandanna), ఇప్పుడు హారర్ ప్రపంచం(Horror World)లోకి అడుగుపెట్టారు. బాలీవుడ్(Bollywood)లో ఆయుష్మాన్ ఖురానా(Actor Aysman Khurana)తో కలిసి ‘థామా'(Thama Movie) అనే హారర్ థ్రిల్లర్‌లో ఆమె నటిస్తున్నారు.
ఈ జానర్‌లో రష్మిక నటించడం ఇదే తొలిసారి. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే దీపావళికి విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా, సినిమాలోని కీలక పాత్రల పేర్లను పరిచయం చేస్తూ పోస్టర్లను విడుదల చేశారు. హీరో ఆయుష్మాన్ ఖురానా ‘అలోక్’ పాత్రలో నటించగా, రష్మిక ‘తడకా’ అనే శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు.
ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ యక్షసాన్‌గా, పరేశ్ రావల్ రామ్ బజాజ్ గోయెల్‌గా కనిపించనున్నారు. మాడ్‌డాక్ ఫిల్మ్ బ్యానర్‌పై ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అతీంద్రియ శక్తులు, ప్రేమ కథాంశంతో తెరకెక్కినట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా, మంగళవారం ‘వరల్డ్ ఆఫ్ థామా’ పేరుతో ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు.