బీఆర్ఎస్ అధినేత(Brs Chief), మాజీ ముఖ్యమంత్రి (Ex CM) కేసీఆర్ (KCR) రాజకీయ ప్రస్థానం(Political Journey)పై మహేంద్ర తోటకూరి (Mahendra Thotakuri) రచించిన ‘ప్రజాయోధుడు’ పుస్తకాన్ని(Praja Yodudu Book) తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్, కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.
ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగా కేసీఆర్ సినిమా స్టార్ కాదని, ఆయనకు కుల, ధన బలం లేదని కేటీఆర్ అన్నారు. అయినా, వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్, దశాబ్దాల పాటు పాలించిన టీడీపీలను కాదని, ఒక పార్టీని స్థాపించి, తెలంగాణను సాధించిన తీరు అద్భుతమని కొనియాడారు. తెలంగాణ ఏర్పడినప్పుడు దేశంలో వ్యవసాయ రంగంలో 14వ స్థానంలో ఉన్న రాష్ట్రం, కేసీఆర్ పాలనలో నంబర్ వన్ స్థానానికి చేరిందని కేటీఆర్ తెలిపారు.
ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టి, పదేళ్లలో రైతుల ఖాతాల్లో రూ. 73 వేల కోట్లు జమ చేశామని కేటీఆర్ చెప్పారు. అలాగే, కల్యాణలక్ష్మి, పెన్షన్లు, కరోనా వంటి సంక్షోభ సమయాల్లో కూడా పథకాలను ఆపలేదని గుర్తు చేశారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్, నర్సింగ్ కాలేజీని కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ పడిన కష్టం ముందు,
ఇప్పుడు తమ పార్టీ ఎదుర్కొంటున్న కష్టాలు ఏమాత్రం కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ యాసను గతంలో సినిమాల్లో జోకర్లు, విలన్ల కోసం ఉపయోగించేవారని, కానీ ఇప్పుడు ఆ యాసే సినిమాకు ప్రాణంగా మారిందని అన్నారు. పల్లెల్లో ఏం ఉండాలో, పట్టణాలను ఎలా అభివృద్ధి చేయాలో కేసీఆర్‌కు తెలుసని శ్లాఘించారు.