end
=
Tuesday, July 15, 2025
వార్తలురాష్ట్రీయంఏసీబీ అదుపులో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్‌రావు​
- Advertisment -

ఏసీబీ అదుపులో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్‌రావు​

- Advertisment -
- Advertisment -

నీటి పారుదల శాఖ (Irrigation department) విశ్రాంత ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌(Retired ENC) మురళీధర్‌రావు (Muralidhar Rao)ను మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు(ACB Officials) అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసంలో సోదాలు(Rides at Home) కూడా చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు

ఏసీబీ అధికారులు గుర్తించి జరిపిన సోదాలలో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు సమాచారం. ఇక ఈ కేసులో మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను విచారించనున్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌తో పాటు మురళీధర్‌రావు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

ఈఎన్‌సీ జనరల్‌గా కీలకంగా వ్యవహరించిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మురళీధర్‌రావు పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు కూడా మురళీధర్​రావు పదవిలో ఆయన ఉన్నారు. కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ బరాజ్​ కుంగుబాటుపై విజిలెన్స్‌ నివేదిక తర్వాత ప్రభుత్వం ఆయన్ను విధుల నుంచి తప్పించింది.

అలాగే కాళేశ్వరం కుంగుబాటు అంశంలో ఇప్పటికే మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్ విచారణ జరిపింది. కాళేశ్వరం కమిషన్ జరిపిన విచారణలో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు కమిషన్ అడిగిన ప్రశ్నలకు ‘తెలియదు.. మర్చిపోయాను’ అంటూ సమాధానం ఇచ్చారు. ఇక విజిలెన్స్ నివేదికలోనూ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు పేరును అధికారులు చేర్చారు.

ఈ క్రమంలోనే మురళీధర్ రావు ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -