ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రానా, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్, రష్మిక మందాన తదితర ప్రముఖులను ఇంటర్యూ చేసి ఆకట్టుకున్న సామ్.. ఇప్పుడు ఏకంగా తన కుటుంబ సభ్యులనే ఇంటర్వ్యూ చేయబోతోంది.
టాలీవుడ్ యంగ్ హీరోస్ నాగచైతన్య(సమంత భర్త), అఖిల్‌లను పలు ప్రశ్నలడగబోతోంది. ఈ షో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని ప్రోమో చూస్తే తెలుస్తోంది. కాగా, సామ్ తనను ఎంత ఆట పట్టింస్తుందోనని చై కాస్త ఆందోళనకు గురవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాలు, తమ ఫ్యామిలీ మ్యాటర్స్ ఈ షోలో చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు. కాగా, తమకు వదిన(సమంత)తో ఎలాంటి ఇబ్బంది లేదని, కంఫర్టబుల్‌గా షో జరుగుతుందని ఆశిస్తున్నట్లు అఖిల్ తెలిపాడు.