end
=
Friday, May 17, 2024
సినీమాSamantha:ఆ వెబ్‌సిరీస్ నుంచి త‌ప్పుకున్న స‌మంత!
- Advertisment -

Samantha:ఆ వెబ్‌సిరీస్ నుంచి త‌ప్పుకున్న స‌మంత!

- Advertisment -
- Advertisment -
  • అనారోగ్య స‌మ‌స్యలే కారణమంటున్న నెటిజన్లు

గత కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్యల‌తో సతమతమవుతున్న సమంత (Samantha)ఇటీవల వరసగా వార్తల్లో నిలుస్తోంది. నిజానికి నాగచైతన్య (Naga chaitanya)తో విడాకుల ఇష్యూ తర్వాత హాట్ టాపిక్‌గా మారిన ఆమె వ్యవహారం ఈ మయోసైటీస్ (Myositis)వ్యాధి సోకిననుంచి మరింత చర్చకు దారితీసింది. ఇదిలావుంటే.. తాజాగా ఆరోగ్యం స‌హకరించట్లేదనే కారణంతో ఓ బాలీవుడ్ వెబ్‌సిరీస్ (Bollywood web series) నుంచి ఆమె త‌ప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. రెండు నెలల క్రితం తాను మ‌యోసైటిస్ బారిన ప‌డిన‌ట్లు స‌మంత పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ వ్యాధి కార‌ణంగా ‘య‌శోద’ (‘Yashoda’) ప్రమోష‌న్స్‌తో పాటు సినిమా షూటింగ్‌ల‌కు కొన్నాళ్లుగా దూరంగా ఉంటోంది.

అయితే తాజాగా రాజ్‌డీకే ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి సామ్ వైదొలిగిన‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. ప్రస్తుతం ఫ్యామిలీమ్యాన్-2 తో త‌న‌ను బాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసిన ద‌ర్శక‌ద్వయం రాజ్ డీకేల‌తో హిందీలో వెబ్‌సిరీస్ చేస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ తెర‌కెక్కుతోంది. ఈ సిరీస్ కోసం మార్షల్ ఆర్ట్స్‌లో స‌మంత స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకున్నది. త్వర‌లోనే షూటింగ్‌ను మొద‌లుపెట్టేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా స‌మంత మ‌యోసైటిస్ బారిన ప‌డ‌టంతో షూటింగ్‌ను వాయిదావేశారు. తాజాగా ఈ సిరీస్ నుంచి స‌మంత త‌ప్పుకోన్నట్లు బాలీవుడ్ స‌ర్కిల్‌లో ప్రచారం జ‌రుగుతోంది. మ‌యోసైటిస్ నుంచి స‌మంత పూర్తిగా కోలుకోవ‌డానికి మ‌రో మూడు, నాలుగు నెల‌లు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించిన‌ట్లు తెలుస్తోంది. కాబట్టి అప్పటివ‌ర‌కు స‌మంత షూటింగ్‌ల‌లో పాల్గొనే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు.

అయితే సినీ ప్రముఖులంతా ఆమె హెల్త్ ప్రాబ్లమ్ వల్లే వెబ్‌సిరీస్ నుంచి స‌మంత త‌ప్పుకుంద‌ని చెబుతుండగా.. ఈ సిరీస్‌లో స‌మంత‌తో పాటు బాలీవుడ్ హీరో వ‌రుణ్‌ధావ‌న్ కీల‌క పాత్ర పోషిస్తోన్నారు. సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటోన్న స‌మంత లాంగ్ గ్యాప్ త‌ర్వాత సోమ‌వారం అభిమానుల‌తో ముచ్చటించింది. మ‌యోసైటిస్ కార‌ణంగా జీవితం గ‌తం కంటే చాలా భిన్నంగా మారిపోయింద‌ని పేర్కొన్నది. నూత‌నోత్తేజంతో తిరిగి అంద‌రి ముందుకు వ‌స్తాన‌ని వెల్లడించింది.

చైతన్యతో విడాకుల తర్వాత పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ గుణశేఖర్‌ (Gunasekhar)తో ‘శాకుంతలం’ (Shakuntalam) మూవీలో నటించింది సామ్. నిజానికి ఈ ప్రాజెక్ట్ 2020 అక్టోబర్‌లో ప్రకటించినప్పటికీ.. పాండమిక్ తదితర కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. ఇక షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినప్పటికీ.. 3D వెర్షన్ కోసం జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అయితే సమంత లేటెస్ట్ మూవీ ‘యశోద’ మంచి సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం ‘శాకుంతలం’ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త సంవత్సరంలో సినిమా విడుదల తేదీని ప్రకటించారు.గుణ టీమ్ వర్క్స్ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2023 ఫిబ్రవరి 17 నుంచి మీ సమీప థియేటర్లలో ఎపిక్ లవ్ స్టోరీ ‘శాకుంతలం’ వీక్షించండి. 3D వెర్షన్‌లో సైతం!!’ అంటూ సమంత, దేవ్ మోహన్ రొమాంటిక్ పిక్‌తో కూడిన రిలీజ్ పోస్టర్‌ను పోస్ట్ చేశారు. ఇందులో సమంత శకుంతలగా టైటిల్ రోల పోషించగా.. దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు.

కాగా ఈ చిత్రం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ‘సర్’, విశ్వక్ సేన్ ‘ధమ్కీ’తో పాటు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది. ఇక శాకుంతలం చిత్రంలో దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా.. ఈ మైథలాజికల్ డ్రామాను 2డితో పాటు 3డి వెర్షన్‌లో కూడా విడుదల చేస్తు్న్నారు మేకర్స్.కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణ శేఖర్ దృశ్య కావ్యంగా మలిచినట్లు తెలుస్తోంది. నిజానికి సినిమాల్లో రొమాంటిక్‌ యాంగిల్‌ను ప్రజెంట్ చేయడంలో గుణ శేఖర్ స్టైలే వేరు. దీంతో ఎపిక్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ ‘శాకుంతలం’ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్నారు.

(Hindustan Copper Limited:HCLలో ఉద్యోగాలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -