end
=
Saturday, November 22, 2025
వార్తలురాష్ట్రీయంవిశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- Advertisment -

విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

- Advertisment -
- Advertisment -

Puttaparthi : పుట్టపర్తిలో భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి మహోత్సవాలు (Bhagwan Sri Sathya Sai Baba Centenary Celebrations)వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక అతిథిగా పుట్టపర్తికి చేరుకున్నారు. ఆమె రాకతో ఆ ప్రాంతం పండుగ వాతావరణంలో మార్మోగింది. పుట్టపర్తి విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh)తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు రాష్ట్రపతికి సాదర స్వాగతం పలికారు. గౌరవ అతిథుల రాకను పురస్కరించుకుని అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వాగతం అనంతరం రాష్ట్రపతి ప్రత్యక్షంగా ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొని భక్తులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా భగవాన్‌ సత్యసాయి బాబా సేవా కార్యక్రమాలు, ఆయన బోధనలు, ప్రపంచవ్యాప్త సేవా సంస్థల కార్యకలాపాలపై నివేదికలను పరిశీలించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కూడా రాష్ట్రపతితో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాయి కుల్వంత్‌ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనతంరం రాష్ట్రపతి ప్రసంగించారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి. ఆయన సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారు. ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని రాష్ట్రపతి అన్నారు. భగవాన్‌ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ శతజయంతి మహోత్సవాలు పుట్టపర్తిని మరోసారి ఆధ్యాత్మికతతో కళకళలాడిస్తున్నాయి.

అంతకు ముందుగానే కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పుట్టపర్తి చేరుకున్నారు. వారిని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు ఘనంగా ఆహ్వానించారు. శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో పుట్టపర్తి అంతటా భక్తుల రాకపోకలు మరింతగా పెరిగాయి. స్థానికంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఇక ,సాయంత్రం జరగనున్న మరో ముఖ్య కార్యక్రమంగా శ్రీ సత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం ఉండనుంది. ఈ వేడుకకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. స్నాతకోత్సవంలో కూడా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. విద్యార్థుల కోసం జరగనున్న ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ప్రసంగం ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి వంటి ఉన్నత స్థాయి నాయకుల సందర్శనలతో పుట్టపర్తి ప్రాంతం ఉత్సాహభరితంగా మారింది. భక్తులు, స్థానికులు, విద్యార్థులు, సేవకులు అందరూ కలిసి శతజయంతి మహోత్సవాలను మరింత భవ్యంగా మార్చుతున్నారు. భగవాన్‌ సత్యసాయి బాబా జ్ఞాపకాన్ని స్మరించుకుంటూ, ఆయన సేవా మానవతా సందేశాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ పుట్టపర్తి ఆధ్యాత్మికతతో నిండిపోయింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -