end
=
Wednesday, August 13, 2025
రాజకీయం24 నుంచి రెండో విడత జనహిత యాత్ర
- Advertisment -

24 నుంచి రెండో విడత జనహిత యాత్ర

- Advertisment -
- Advertisment -

పీసీసీ అధ్యక్షుడు (PCC Chief) మహేష్ కుమార్‌ గౌడ్ (Mahesh Kumar Goud) రెండో విడత(Second Session) కాంగ్రెస్ జనహిత పాదయాత్ర (Janahita Yatra)కు సిద్ధమయ్యారు. ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్‌లోని చొప్పదండి నియోజకవర్గంలో యాత్ర ప్రారంభంకానున్నది. పాదయాత్రలో భాగంగా ఆయన ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించడం, పార్టీ కార్యకర్తలతో సమావేశమవ్వడం (Meeting With Party Leaders),

శ్రమదానం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఆగస్టు 24న సాయంత్రం 5 గంటలకు చొప్పదండిలో యాత్ర ప్రారంభమై, 25న ఉదయం శ్రమదానం, తర్వాత పార్టీ కరీంనగర్ జిల్లా కార్యకర్తలతో సమావేశం అవుతారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట (Vardhanna Peta) నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. 26న ఉదయం వర్ధన్నపేటలో శ్రమదానం, ఆ తర్వాత వరంగల్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం ఉంటుంది.

అనంతరం అదే రోజు సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ బుధవారం మధ్యాహ్నం 1 గంటకు జూమ్ మీటింగ్ నిర్వహించి, జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, జనహిత పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందన వంటి అంశాలపై చర్చించారు.

గతంలో పరిగి, ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో మొదటి విడత యాత్ర నిర్వహించిన మహేష్‌గౌడ్, బీసీలకు రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా కారణంగా మొదటి విడత యాత్రను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -