end
=
Tuesday, November 18, 2025
వార్తలుఅంతర్జాతీయంహార్వర్డ్‌ యూనివర్సిటీ సమీపంలో కాల్పులు..క్యాంపస్‌లో ఉద్రిక్తత
- Advertisment -

హార్వర్డ్‌ యూనివర్సిటీ సమీపంలో కాల్పులు..క్యాంపస్‌లో ఉద్రిక్తత

- Advertisment -
- Advertisment -

America : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన (A shooting incident)కలకలం రేపింది. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం (Harvard University) క్యాంపస్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆకస్మికంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ సంఘటన హార్వర్డ్‌ క్యాంపస్‌లో భయాందోళనలు రేపింది. స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన శుక్రవారం సాయంత్రం షెర్మాన్‌ స్ట్రీట్‌లోని డానేహా పార్క్‌ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రాంతం హార్వర్డ్‌లోని రాడ్‌క్లిఫ్‌ క్వాడ్‌కు సమీపంలో ఉండటంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సైకిల్‌పై వచ్చిన ఒక వ్యక్తి, మరో వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, బుల్లెట్లు ఎవరికీ తగలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిసర ప్రాంతాన్ని ముట్టడి చేశారు. నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి, దుండగుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై హార్వర్డ్‌ యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే స్పందించింది. విద్యార్థులు, సిబ్బంది ఎవరూ క్యాంపస్‌ బయటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తూ అత్యవసర భద్రతా చర్యలు అమల్లోకి తెచ్చారు. అలాగే, పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేయగా, అదనపు పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు కాల్పుల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటన్న దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన అమెరికాలో గన్‌ హింసపై మరోసారి ఆందోళనలు రేపుతోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -