end
=
Tuesday, July 1, 2025
వార్తలుఅంతర్జాతీయంఅంతరిక్షంలోకి శుభాంశు శుక్లా.. ఎన్నిరోజుల పర్యటనో తెలుసునా?
- Advertisment -

అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా.. ఎన్నిరోజుల పర్యటనో తెలుసునా?

- Advertisment -
- Advertisment -

భారతీయులు ఎంతగానే ఎదురుచూస్తున్న వ్యోమగామి శుభాంశు శుక్లా (Astronaut Shubhansu Shukhla) అంతరిక్ష యాత్ర సక్సెస్​ (Space tour Success) అయింది. అమెరికాలోని ఫ్లోరిడా ‘నాసా’కు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ (Kennedi Space Centre) నుంచి భారత కాలమాన ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.

యాక్సియం 4 (Axiom-4) మిషన్‌లో భాగంగా శుభాంశుతో కమాండర్ పెగ్గీ విట్సన్ (అమెరికా), స్పెషలిస్టులు టిబర్ కపు (హంగేరీ), స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ (పోలండ్) రోదసిలోకి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న ఫాల్కన్ రాకెట్ క్యాప్సుల్ (Falcon Rocket Capsule) విడిపోయి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) దిశగా ప్రయాణం కొనసాగించింది. 28 గంటల ప్రయాణం తర్వాత మర్నాడు సాయంత్రం అంతర్జాతీయ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కానున్నది.

ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం 14 రోజుల పాటు అంతరిక్షంలోనే ఉండనున్నారు. మిషన్‌కు శుభాంశు పైలెట్‌గా వ్యవహరించనున్నారు. యాక్సియం వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలకు ప్రాతినిధ్యం చేయనున్నారు. తద్వారా ఐఎస్‌ఎస్‌లో ఒకే మిషన్‌లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది. కాగా శుభాంశు అంతరిక్ష యాత్రం కోసం భారత్ రూ. 550 కోట్లు ఖర్చు చేసినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది.

ఎవరీ శుభాంశు?
41 ఏళ్ల తర్వాత అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెడుతున్న భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించారు. 1984లో రాకేశ్ శర్మ మొదటిసారి విజయవంతంగా అంతరిక్షయానం చేశారు. ఆ తర్వాత అంతరిక్షానికి వెళ్లిన భారతీయడు శుభాంశు. ఆయన ఇస్రో గగన్‌యాన్ ప్రాజెక్టుకు ఎంపికయ్యారు. ఆయన స్వస్థలం లక్నో. 2006లో ఆయన భారత వైమానిక దళంలో చేరారు. ఫైటర్ జెట్​ పైలెట్‌ సేవలందిస్తున్నారు.

ఆయనకు 2 వేలకు పైగా విమానాలు నడిపిన అనుభవం ఉంది. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మొదలవ్వగానే ఆయన కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడి యాత్రను చూసిన సంతోషంతో తల్లి ఆశా శుక్లా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె పక్కన కూర్చున్న తండ్రి శంభు దయాళ్ శుక్లా ఉత్సాహంగా కనిపించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -