పాతికేళ్ల (Silver jubilee)నుంచి ఓ ప్రముఖ చానెల్‌లో అప్రతిహతంగా ప్రసారం అవుతున్న `పాడుతా తీయగా` (Paadutha teeyaga)సింగింగ్ కాంపిటీషన్ పై సింగర్ ప్రవస్థీ(Singer Pravasthi) సంచలన ఆరోపణలు(Allegations on judges) చేసింది. కాంపిటీషన్ అంతా బూటకమని ఆమె ఆరోపిస్తున్నారు. లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యతగా వ్యవహరించిననన్ని నాళ్లు కాంపిటీషన్ సజావుగా సాగిందని, సింగర్లకు అక్కడ గౌరవ మర్యాదలు దక్కేవని గుర్తు చేసుకుంటున్నది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అయింది.
ప్రముఖ టీవీ చానళ్లు సైతం ఆమె ను ప్రత్యేకంగా ముఖాముఖీ నిర్వహిస్తున్నాయి. ఒక దశలో ప్రవస్థీ తన సింగింగ్ కెరీర్ పోయినా ఫర్వాలేదు కానీ.. సదరు కాంపిటీషన్‌లో లోపాలను చెప్పే తీరుతానంటున్నది. ఇంతకీ ఆమె ఆవేదన ఏంటంటే…
పొట్టి బట్టలు వేసుకోమని ఫోర్స్..
బాలసుబ్రహ్మణ్యం బతికి ఉన్న కాలంలో ఉన్న సంస్థ ఇప్పుడు ఆ కార్యక్రమం నుంచి తప్పుకున్నదట. ఆస్థానంలో కొత్త సంస్థ వచ్చిందంట. ఆ సంస్థ తమకు ఇష్టమైన కంటిస్టెంట్లను మాత్రమే ప్రోత్సహిస్తున్నదని ప్రవస్థీ ఆరోపిస్తున్నది. ఆమె మాటల ప్రకారం.. ఆ కంటిస్టెంట్లకు అనువైన పాటలనే ఎంపిక చేసి ఇస్తున్నరట. మెకప్ మెన్, ట్రూప్ అంతా ఆమెను బాడీ షేమింగ్ చేస్తున్నరట. ఆమె అధిక బరువు ఉండడంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నరట. ఏ డ్రెస్ ఆమెకు సూట్ కావడం లేదని ఈసడించుకుంటున్నరట. అంతేకాదు.. తమకు పొట్టి బట్టలు వేసుకోవాలని బలవంతం చేస్తున్నరట.
ఏదైనా ప్రశ్నిస్తే ఇప్పుడు ఈ ట్రెండే నడుస్తున్నది.. కచ్చితంగా వేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నరంట.
కీరవాణి వాళ్లు గాయకులే కాదన్నరు..
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సింగర్లను సరిగా ట్రీట్ చేయడం లేదని ప్రవస్థీ వాపోతున్నది. ఆమె వ్యాఖ్యల ప్రకారం.. ఆయనకు పెళ్లిళ్లు, ఫంక్షన్లలో పాడే సింగర్లంటే అస్సలు నచ్చదంట. అలా పాడేవారు కీరవాణి దృష్టిలో అసలు గాయకులే కారట.అంతేకాదు.. కీరవాణి అక్కడితో ఆగలేదట. ఫలానా స్థానంలో నిలిచిన సింగర్‌కు తన ట్రూప్‌లో చేర్చుకుంటారని, వారంతా ఆయన వద్ద చాకిరీ చేస్తున్నారని, అలాగే ఈ కాంపిటీషన్ నుంచి ఎంపికైన వారికి చాకిరీ చేసుకునే అవకాశం కల్పిస్తానని నీచంగా అన్నారట. ఇక సింగర్ సునీతకు ప్రవస్థీ అంటేనే పడదట.
ప్రవస్థీ ఎప్పుడు స్టేజీ మీదకు వచ్చినా ఆమె ముఖం చిట్టంచికుంటుందట. తనకు నచ్చిన కంటెస్టట్లనే ప్రోత్సహిస్తున్నదట. ఇక సినిమాల్లో తను పాడిన పాటలకైతే మంచి రేటింగ్ ఇస్తున్నారు. ఇంచుమించు గేయ రచయిత చంద్రబోస్ సైతం ఇలాగే చేస్తున్నరట. కాంపిటీషన్ నుంచి ప్రవస్థీని ఎలిమినేట్ చేసేటప్పుడు ఆమె పట్ల అమానవీయంగా ప్రవర్తించారట. కనీసం ఒక్క ఓదార్పు మాటైనా మాట్లాడలేదంట.