అప్పో సప్పో చేసి.. పెట్టుబడి(Investment in farming) సమకూర్చుకుని.. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే ప్రకృతి రైతులపై ప్రకృతి కన్నెర్ర చేసింది. వడగండ్ల వాన (Hailstorm)కురిపించి పంటలను కబళించింది. చివరికి రైతు కంట కన్నీరే మిగిల్చింది(Farmers get loss). ఇటీవల కురిసిన వడగండ్ల వానకు సిద్దిపేట జిల్లా(Siddipet District) రాయపోల్ మండల పరిధిలోని వందలాది ఎకరాల్లో పంట నేలవాలింది. ఏం చేయాలో తెలియని రైతులు ఆదివారం రోడ్డెక్కారు. గుర్రాలసోఫా రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని, తమకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా రహదారిపై గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, సోమవారం రాయపోల్ మండలంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులను పరామర్శించి.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.