end
=
Tuesday, July 1, 2025
సినీమాశ్రీలీల ఔట్​.. భాగ్యశ్రీ ఇన్​
- Advertisment -

శ్రీలీల ఔట్​.. భాగ్యశ్రీ ఇన్​

- Advertisment -
- Advertisment -

‘మిస్టర్ బచ్చన్’తో కలిసి తెలుగు చిత్రసీమ (Telugu Film Industry)లో అడుగుపెట్టింది మరాఠా భామ (Marati Model) భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sree Borse). ఆ సినిమాతో తొలిసారి టాలీవుడ్ తెర (Tollywood Screen)పై మెరిసిన ఈ బ్యూటీకి మంచి మార్కులే పడ్డాయి. ఆ చిత్రంలో గ్లామర్‌తో ఆకట్టుకోవడమే కాక డాన్సులతోనూ మెప్పించి, ప్రేక్షకులకు దగ్గరైంది. అటు దర్శక నిర్మాతల మనసూ దోచేసింది.

దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వస్తున్నాయి. రామ్ పోతినేనితో సినిమా చేస్తుండగానే విజయ్ దేవరకొండతో ‘కింగ్‌డమ్’లో నటించే సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘కాంత’గానూ ప్రేక్షకులను పలుకరించనుంది. భాగ్యశ్రీ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో విడుదలైంది రవితేజ కథానాయకుడిగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ మాత్రమే. మిగతావన్నీ వివిధ దశల్లో ఉన్నాయి.

అంటే, విడుదలైన ఒక్క సినిమాతోనే ఇలా ఒకదాని వెనుక ఒకటి ఛాన్సులు క్యూ కడుతుండగానే మరో అదృష్ట భాగ్యమూ ఈ భామకు కలిగింది. అక్కినేని అఖిల్‌తో సితార సంస్థ నిర్మిస్తున్న ఓ సినిమా నిర్మిస్తోంది. ఇందులో శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ, శ్రీలీల డేట్స్ కుదరకపోవటంతో ఆమెను తప్పించారట మేకర్స్. అలా శ్రీలీల ఆ ప్రాజెక్టు కోల్పోవటంతో ఆ స్థానాన్ని భాగ్యశ్రీ దక్కించుకుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -