end
=
Tuesday, October 14, 2025
వార్తలురాష్ట్రీయంఏఐ మాయలో టీడీపీ నేతలు..చంద్రబాబు, దేవినేని ఉమ పేరుతో భారీ మోసం
- Advertisment -

ఏఐ మాయలో టీడీపీ నేతలు..చంద్రబాబు, దేవినేని ఉమ పేరుతో భారీ మోసం

- Advertisment -
- Advertisment -

AI Video Call Fraud: సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ఓ అద్భుతం అయితే, దాన్ని అడ్డం పెట్టుకుని మోసాలు చేయడమూ అంతే శక్తివంతంగా మారింది. తాజాగా, ప్రముఖ తెలుగు రాజకీయ నేతలైన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu), దేవినేని ఉమామహేశ్వరరావుల ( Devineni Uma)ముఖాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఉపయోగించి మోసగాడు ఒకడు భారీ స్కాం చేసి నడుం నడిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన తెలంగాణ టీడీపీ నాయకులను తీవ్రంగా ఆశ్చర్యపరచింది.

వీడియో కాల్ మాయాజాలం

గత నెల 30న ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన టీడీపీకి చెందిన కొంతమంది స్థానిక నాయకులకు ఓ అనామక వ్యక్తి ఫోన్ చేశాడు. తనను దేవినేని ఉమ పీఏగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి ఉమ గారు మీతో మాట్లాడతారు అంటూ ముందుగా పరిచయం కల్పించాడు. కొద్దిసేపటికే వీడియో కాల్ ద్వారా దేవినేని ఉమ ముఖంతో ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఈ కాల్‌లో తెలంగాణ టీడీపీని బలోపేతం చేయాలని, కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయాలని ఆయన వివరించారు. ఆ మాటలకు మంత్రిమాటలైన భ్రమలో పడ్డ నాయకులు, మాటలు నమ్మి రూ.35 వేలు ఫోన్ పే ద్వారా పంపించారు. కొద్దిరోజులకు అదే వ్యక్తి మళ్లీ సంప్రదించి ఈసారి పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీ-ఫారమ్స్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. మరింత ఆశ్చర్యకర విషయం ఏమంటే చంద్రబాబు గారు కూడా మాట్లాడతారు అంటూ మరో మాయ చూపించాడు.

చంద్రబాబు ముఖంతో మరో దెయ్యం

ఆ తర్వాత కొద్ది సేపటికే చంద్రబాబు నాయుడి ముఖంతో ఉన్న ఓ వ్యక్తి వీడియో కాల్ చేశాడు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పార్టీకి బలాన్నివ్వాలని, కార్యకర్తలు శ్రమించాలన్న సందేశం ఇచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన సత్తుపల్లి నేతలు, ఇది నిజంగా సీఎం మాట్లాడినదే అనుకుని పూర్తిగా నమ్మేశారు.

విజయవాడ పయనం… మోసం స్పష్టత

అమరావతికి రాగానే బీ-ఫారమ్స్ ఇస్తానని మాయ మాటలతో నమ్మించిన ఆ మోసగాడు సూచన మేరకు, 18 మంది టీడీపీ నాయకులు విజయవాడ చేరుకున్నారు. బందరు రోడ్డులోని ఓ హోటల్‌లో బస చేయగా, ఆ మోసగాడు ముందే హోటల్ యాజమాన్యానికి ఫోన్ చేసి వాళ్లే మనవాళ్లు… బిల్లు నేను చెల్లిస్తాను అన్న మాటలతో వాళ్లను నమ్మించాడు. కానీ సాయంత్రం వరకు ఎవరూ రాకపోవడంతో పాటు, మరోసారి ఫోన్ చేసి సీఎంను కలవాలంటే ఒక్కో వ్యక్తి రూ.10 వేలు చెల్లించాలి అన్న డిమాండ్‌తో సత్తుపల్లి నాయకుల్లో అనుమానం మొదలైంది.

పోలీసుల దర్యాప్తులో అసలు రంగు బయటకు

ఈ క్రమంలో హోటల్ సిబ్బంది భోజన బిల్లు రూ.26 వేలు చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేయడంతో వివాదం తలెత్తింది. విషయం తెలుసుకున్న విజయవాడ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. దీంతో అసలు మాయజాలం బయటపడింది. బాధితులు వివరాలు వెల్లడించగా, దేవినేని ఉమను సంప్రదించిన పోలీసులు ఇది నాతో ఎలాంటి సంబంధం లేదు. ఇటువంటి మోసాలకు ఏలూరుకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి పాల్పడుతున్నట్టు తెలిసింది అని ఆయన స్పష్టం చేశారు.

బాధితుల నిరాకరణ, పోలీసులు సర్దిచెప్పిన వ్యవహారం

పరువు పోతుందనే భయంతో మోసపోయిన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో పోలీసులు ఇరువర్గాల మధ్య సర్దిచెప్పి, హోటల్ బిల్లులో సగం చెల్లించేలా చేసి, ఆ నేతలను పంపించారు. ఈ సంఘటన ద్వారా తేలిన ముఖ్యమైన విషయం టెక్నాలజీని జాగ్రత్తగా వినియోగించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఏఐ మాయలో మురిసి పోకుండా, ప్రతి ఫోన్ కాల్, వీడియో కాల్ వెనుక ఉన్న వాస్తవాన్ని గమనించే తెలివితేటలు సమాజానికి అవసరం. లేదంటే, భవిష్యత్తులో మరిన్ని మోసాలు జరగకుండా ఉంటాయన్న హామీ ఇవ్వలేం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -