end
=
Tuesday, July 15, 2025
వార్తలుజాతీయంతెలంగాణ చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్
- Advertisment -

తెలంగాణ చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్

- Advertisment -
- Advertisment -

దేశంలోని ఐదు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల (Chief Justices For States)ను నియమిస్తూ సోమవారం కేంద్రం (Central Government) ప్రకటన విడుదల చేసింది. సుప్రీం కోర్టు కొలీజియం (Supreme Court Colligium) సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించడంతో ఈ ప్రకటన వెలువడింది. ఉత్తర్వుల ప్రకారం.. త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్‌ (Justice Aparesh Kumar Singh)

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Telangana Chief Justice)గా నియమితులయ్యారు. ఇదే సమయంలో జార్ఖండ్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రారావు త్రిపురకు బదిలీ కానున్నారు. రాజస్థాన్ హైకోర్టు సీజే జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాత్సవ మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్ కేఆర్ శ్రీరామ్ రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లనున్నారు.

మధ్యప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ సీజే సంజీవ్ సచ్‌దేవ అదే హైకోర్టుకు పూర్తి సీజేగా బాధ్యతలు చేపడతారు. పట్నా హైకోర్టు యాక్టింగ్ సీజే జస్టిస్ అశుతోష్ కుమార్ గుహవాటి హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. హిమాచల్ హైకోర్టు జడ్జి జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహన్ జార్ఖండ్‌కు, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ విభూ భక్రూ కర్ణాటక హైకోర్టుకు, పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ విపుల్ మనూభాయి అదే హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.

రామచంద్రరావు తెలుగువాడు..
త్రిపుర సీజేగా వెళ్ల నున్న ఎం.ఎస్. రామచంద్రారావు అచ్చమైన తెలుగువారు. 1966లో హైదరాబాద్‌లో పుట్టిన జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి ఎఎల్‌ఎమ్ పట్టాలు పొందారు. పంజాబ్, హర్యానా, తెలంగాణ హైకోర్టుల్లో జడ్జిగా, హిమాచల్ ప్రదేశ్‌లో సీజేగా కూడా పనిచేశారు. గతంలో తెలంగాణ హైకోర్టుకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా కూడా కొద్దిరోజులు బాధ్యతలు నిర్వర్తించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -