end
=
Saturday, January 10, 2026
వార్తలురాష్ట్రీయంమెగాస్టార్ సినిమా టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
- Advertisment -

మెగాస్టార్ సినిమా టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

- Advertisment -
- Advertisment -

Chiranjeevi movie : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu)పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ(Sankranti festival) కానుకగా ఈ చిత్రం ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కుటుంబ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు భారీగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. సినిమా టికెట్ ధరల పెంపునకు(Movie ticket price hike)ష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వడంతో చిత్ర బృందానికి ఊరట లభించింది. సినిమా విడుదలకు ముందురోజు అయిన ఈ నెల 11న ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ప్రీమియర్ షోతో పాటు విడుదలైన తరువాత వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం వద్ద విజ్ఞప్తి చేశారు. చిత్ర బృందం అభ్యర్థనను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ప్రీమియర్ షో టికెట్ ధరను గరిష్టంగా రూ.600 వరకు నిర్ణయించుకోవచ్చని తెలిపింది. అలాగే సాధారణ రోజుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరను రూ.50 వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇక మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలను రూ.100 వరకు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ పెంచిన ధరలను సినిమా విడుదలైన రోజు నుంచి మొత్తం వారం రోజుల పాటు మాత్రమే వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

సంక్రాంతి సీజన్ కావడంతో థియేటర్ల వద్ద భారీ సందడి నెలకొనే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరంజీవి వంటి స్టార్ హీరో సినిమా కావడం, పైగా పండుగ వాతావరణం కలిసిరావడంతో మొదటి వారం వసూళ్లపై చిత్ర బృందం భారీ ఆశలు పెట్టుకుంది. టికెట్ ధరల పెంపు అనుమతితో నిర్మాతలకు కొంత మేర ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు. ఇక ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో చిరంజీవి వినూత్న పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుటుంబ భావోద్వేగాలు, వినోదం, సందేశం మేళవించిన కథతో ఈ సినిమా రూపొందినట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రచార సామగ్రి సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ప్రభుత్వం ఇచ్చిన టికెట్ ధరల పెంపు అనుమతితో సినిమా విడుదలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. సంక్రాంతి బరిలో మెగాస్టార్ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -