హైదరాబాద్ : అఖిల భారత సివిల్ సర్విసెస్ పరీక్షా ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఉత్తమ ప్రతిభను చూపిన తెలంగాణ తేజాలు సివిల్స్‌లో మెరుగైన ఫలితాలు సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని గుండ్ల బావి గ్రామానికి చెందిన దాత్రి రెడ్డి సివిల్స్ ఫలితాల్లో 46వ ర్యాంకు సాధించింది. క్రితం ఫలితాల్లో ఈమె 283వ ర్యాంకు సాధించి ఐపీఎస్ ట్రైనింగ్‌లో ఉన్నారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బుద్దారం గ్రామానికి చెందిన కట్టా రవి తేజ సివిల్స్‌లో 77వ ర్యాంకు సాధించాడు. సిద్దిపేటకు చెందిన మంద మకరంద్ 110వ ర్యాంక్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామవాసి బడేటి ప్రకాష్ గౌడ్ 218వ ర్యాంక్, మంచిర్యాల జిల్లాలోని బెల్లింపల్లికి చెందిన సిరిశెట్టి సంకీర్త్ 330వ ర్యాంక్, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఇర్లపూడి గ్రామానికి చెందిన బానోత్ మృగేందర్ లాల్ 505 ర్యాంకు సాధించాడు. గతేడాది సివిల్స్ ఫలితాల్లో 551 ర్యాంకు సాధించాడు. ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం మహారాష్ట్రలో పనిచేస్తున్నాడు. ఇతను ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మదన్‌లాల్ కుమారుడు. సిద్దిపేట జిల్లాకు చెందిన డి. వినయ్‌కాంత్ సివిల్స్ ఫలితాల్లో 516వ ర్యాంక్ సాధించాడు.
- Advertisment -
సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ తేజాలు
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -