విశాఖ : కరోనా ఎఫెక్ట్ ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకుపై పడింది.14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించారు. అరకు లోయలో ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించారు. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన, వ్యాపార, జేఏసీ, ఇతర సంఘాల సమావేశంలో అరకు లోయలో కరోనా కేసుల తీవ్రత…లాక్‌డౌన్ విధిస్తే పరిస్థితి ఏంటి? అనేదానిపై చర్చించారు. ఆ తర్వాత 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని తీర్మానం చేశారు. గత రెండు రోజులుగా అరకు లోయలో కరోనా కేసులు పెరుగుతుండడంతో.. కట్టడి చర్యలకు పూనుకున్న ఎమ్మెల్యే ఫాల్గుణ తీర్మానం చేశారు.
- Advertisment -
Sample Page Title
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -