మాస్ మహారాజా (Mass Star) రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర`(Mass Jathara Movie). యువ దర్శకుడు, సక్సెస్‌ఫుల్ రైటర్ భాను భోగవరపు (Director Bhanu Bhogavarapu) ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినట్లు ప్రచారం జరుగుతోంది. సూర్యదేవర నాగవంశీ (Producer Naga Vamshi), సాయి సౌజన్య సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానున్నది. తాజాగా విడుదలైన చిత్రం టీజర్ యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్నది. రవితేజ అభిమానులు ఆశించే అన్ని అంశాలు ‘మాస్ జాతర’ టీజర్ లో ఉన్నాయి. రవితేజ శైలి యాక్షన్, వింటేజ్ ఎనర్జీతో నిండిన ఫుల్ మీల్స్ మాస్ ఎంటర్ టైనర్ ను చూడబోతున్నామనే హామీని టీజర్ ఇస్తోంది. రవితేజ తనదైన చురుకుదనం, కామెడీ టైమింగ్ తో కట్టిపడేశారు. శ్రీలీల మరోసారి బలమైన పాత్రలో మెరిసిపోయింది.
రవితేజ, శ్రీలీల జోడి మరోసారి మాయ చేసేలా ఉంది. వినాయక చవితి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం పండుగ ఉత్సాహాన్ని పెంచేలా కనిపిస్తున్నది.