end
=
Thursday, August 7, 2025
సినీమాశ్వేతపై కేసు.. ఎందుకో తెలుసా?
- Advertisment -

శ్వేతపై కేసు.. ఎందుకో తెలుసా?

- Advertisment -
- Advertisment -

 1994లో ‘ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్’ (Ex Miss india Pacific)గా నిలిచిన శ్వేతా మీనన్ (Swetha Menon).. తన తొలి చిత్రం ‘అనస్వరం’తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె ‘రతి నిర్వేదం’, ‘100 డిగ్రీ సెల్సియస్’ వంటి మలయాళ చిత్రాల(Molly wood)తో పాటు తెలుగులో ‘ఆనందం’, ‘జూనియర్స్’, ‘రాజన్న’ వంటి సినిమాల్లోనూ నటించారు. ఈమెపై తాజాగా ఓ కేసు నమోదైంది (Case against Her).

ఆమె నటించిన కొన్ని సినిమాలు, ప్రకటనల్లోని అభ్యంతరకర సన్నివేశాలు (Erotic Scenes) సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయని, అవి యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని (Guiding Wrong Way) కేరళకు చెందిన సామాజిక కార్యకర్త మార్టిన్ తాజాగా కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మొదట్లో పోలీసులు ఈ ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో మార్టిన్ ఎర్నాకుళం కోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఇప్పుడు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామం, శ్వేతా మీనన్ ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో చోటు చేసుకోవడం చర్చకు దారితీసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -