షాద్ నగర్: ఇళ్లను అద్దెకు ఇచ్చేటప్పుడు వారి వద్ద అన్ని పత్రాలు సేకరించాలన్నారు షాద్‌నగర్ సీఐ శ్రీధర్. మీమీ ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే షాద్ నగర్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు షాద్ నగర్పో లీసులు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే.. 08548252333 నెంబర్‌కు ఫోన్ చేసి తెలుపాలన్నారు. పట్టణంలో ఈరోజు మధ్యాన్నం జరిగిన మహిళా మర్డర్ కేసుకు సంబంధించిన విషయమై సీఐ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా కొత్తగా రూములు కావల్సి వచ్చినప్పుడు వారి యొక్క పూర్తి వివరాలను సేకరించి ముందు జాగ్రత్తగా మా పోలీస్ స్టేషన్లో కూడా వారి వివరాలను ఇవ్వాలని పేర్కొన్నారు. అద్దె భవనాల్లో అద్దెకు ఉండే వారి ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, కాంటాక్ట్ నంబర్‌తో సహా వారి పూర్తి వివరాలు తీసుకోవాలన్నారు. మన అజాగ్రత వల్ల అనుకోని సంఘటనలు జరుగుతాయని అన్నారు. అలాగే మీమీ ప్రాంతాల్లో ఇంటి వద్ద సీసీ కెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని సీఐ పిలుపునిచ్చారు.
- Advertisment -
సరైన ధ్రువపత్రాలు తీసుకొని ఇళ్లు అద్దెకు ఇవ్వాలి
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -