పెళ్లి అయి కొన్ని రోజులు గడిచాయో లేదో నరకం చూపిస్తున్న భర్త. చాలా మంచి సంబంధం అని భారీగా కట్న కానుకలు ఇచ్చి మరీ పెళ్లి ఒక పండగల చేశారు. కానీ ఆ మూర్ఖుడు డ్రగ్స్ కి బానిసయ్యడు అని ఆమెకు కాపురానికి వెళ్లగానే తెలిసిపోయింది. వీడు మనిషా, మృగామ నిజంగా అర్థం కాని పరిస్థితి. డ్రగ్స్ వల్ల మనుషులు మరీ ఇలా నీచంగా తయారవుతారా అని అనిపిస్తుంది. తాజాగా బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. మత్తులో తనపై యూరిన్ పాస్ చేశాడని భర్తపై ఓ వివాహిత ఫిర్యాదు చేసింది. దీంతో బసవనగడి కాప్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోని ఓ షాపింగ్ మాల్ ఓనర్ కూతురుని సందీప్ అనే వ్యక్తికి ఇచ్చి ఈ ఏడాది జనవరిలో అంగరంగ వైభవం గా పెళ్లి చేశారు పెద్దలు. భారీగా కట్నం ఇచ్చారు. హై ఎండ్ కార్‌తో పాటు, 4 కేజీల గోల్డ్ ఇంకా 2 షాపింక్ మాల్స్ కట్నం కింద ఆ మహానుభావుడికి ఇచ్చారు. కానీ అతడు వెదవ అని ఆ ఆడకూతురికి కాపురానికి వెళ్లగానే తెలిసిపోయింది. డ్రగ్స్ తీసుకోవడం, ఫ్రెండ్స్‌ను ఇంటికి తీసుకొచ్చి మందు పార్టీలతో రచ్చ చేయడం చూసి బిత్తరపోయింది. వద్దని చెప్పడానికి చాలా ప్రయత్నం చేసింది. కానీ ఆమె మాటలను వినలేదు పట్టించుకోలేదు. కొన్నాళ్లు బాధను భరించింది. కానీ ఆ దరిద్రుడు ఆమెపై దాడి చేయడం, భూతులు తిట్టడం కూడా ప్రారంభించాడు. ఇటీవల ఈ వేధింపులు భరించలేని స్థాయికి వెళ్లాయి. భార్యతో ఘర్షణపడి ఆమె తలపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు.