దక్షిణ భారతదేశం (South India)లో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్స్ అయిన ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)(SIIMA)’ ప్రదానానికి వేదిక సిద్ధమైంది. నిర్వాహకులు ఇప్పటివరకు 12 ఎడిషన్లు (12 th Editions) పూర్తి చేశారు. వచ్చే సెప్టెంబర్ 5, 6వ తేదీల్లో 13వ ఎడిషన్‌కు దుబాయ్ (Next Event in Dubai)లో జరుగనున్నది. వేడుకలో కీలక ఘట్టమైన నామినేషన్స్ ప్రక్రియ (Nominations Starts) శరవేగంగా కొనసాగతున్నది.
గతేడాది దక్షిణాది రాష్ట్రాల్లో విడుదలైన పలు సినిమాలు వివిధ కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుని బరిలో నిలిచాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నుంచి నామినేట్ అయిన సినిమాల జాబితాను తాజాగా ‘సైమా’ కమిటీ ప్రకటించింది. తెలుగు నుంచి అత్యధిక నామినేషన్స్ దక్కించుకున్న సినిమాగా ‘పుష్ప2’ (Pushpa-2) అగ్రస్థానంలో నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకున్నది.
కాగా, ఇప్పుడు ‘సైమా’లో ఏకంగా ఈ సినిమా 11 కేటగిరీల్లో పోటీ పడనున్నది. ఆ తర్వాతి స్థానంలో ‘కల్కి2898ఏడీ’ నిలిచింది. ఈ చిత్రం పది కేటగిరీల్లో పోటీ పడనున్నది.