end
=
Saturday, August 9, 2025
వార్తలుఅంతర్జాతీయంభార‌త్‌తో ఆ అంశంపై చ‌ర్చ‌లుండ‌వు !
- Advertisment -

భార‌త్‌తో ఆ అంశంపై చ‌ర్చ‌లుండ‌వు !

- Advertisment -
- Advertisment -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై భారీ సుంకాలు(Tariffs On India) విధించిన అమెరికా అధ్యక్షుడు (American President) డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. సుంకాల వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని (No more Commercial Meeting) ఆయన తేల్చి చెప్పారు.

అమెరికాలోని ఓవల్ కార్యాలయంలో తాజాగా ఆయ‌న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సుంకాల‌ వివాదం కొలిక్కి వచ్చే వరకు చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రష్యాతో వాణిజ్యం జరిపే దేశాలపై మరిన్ని సుంకాలు ఉంటాయని పరోక్షంగా భార‌త్‌ను హెచ్చరించారు. దీంతో భారత్-అమెరికా మ‌ధ్య వాణిజ్య‌ సంబంధాలు మునుపెన్నడూ లేని స్థాయిలో పతనం కావడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే, ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి అని, ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్‌తో పూర్తిస్థాయి వాణిజ్య చర్చల్లో పాల్గొంటామని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి విషయాల్లో ట్రంప్ స్పష్టంగా ఉన్నారని, దీనికి ప్రతిస్పందనగానే ఆయన చర్యలు తీసుకున్నారని తెలిపారు.

అమెరికా విధించిన సుంకాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవ‌ల‌ ఘాటుగా స్పందించారు. దేశ ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా ఎంతటి మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధమని, రైతులు, మత్స్యకారులు, డైరీ రంగం విషయంలో భారత్ రాజీపడదని స్పష్టం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -