పెళ్ళైన పురుషులతో సంబంధాలు పెట్టుకున్నప్పుడు మహిళలనే తప్పుగా చిత్రీకరిస్తారని బాలీవుడ్ నటి(Bollywood Actress), ఎంపీ(Parliment Member) కంగనా రనౌత్(Kangana Ranaut) అభిప్రాయపడ్డారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తమ జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మహిళలను సమాజం తప్పుగా చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పురుషుడు తప్పు చేసినా, ప్రజలు మాత్రం మహిళలనే నిందిస్తారని(People Blames Woman) ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, డేటింగ్ యాప్‌ల(Dating Apps)ను సమాజంలో ‘మురికి కాలువ’ లాంటివని కంగనా అభివర్ణించారు. ఆత్మవిశ్వాసం లేనివారు, ఎవరో ఒకరి గుర్తింపు కోసం చూసేవారే ఇలాంటి యాప్‌లను వాడుతారని చెప్పారు. మహిళలు తమ భాగస్వాములను పెద్దలు కుదిర్చిన పెళ్లి ద్వారా లేదా చదువుకునే సమయంలో
కనుగొనాలని ఆమె సూచించారు. లివ్-ఇన్ రిలేషన్లు మహిళలకు సురక్షితం కాదని, ఇలాంటి సంబంధాలలో గర్భం వస్తే కుటుంబం నుంచి సరైన మద్దతు ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.