మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Dialogue Writer Trivikram), విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రారంభమైంది. రచయితగా త్రివిక్రమ్ కెరీర్ ప్రారంభంలో వెంకటేశ్‌తో కలిసి ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల (Block Blaster Movies)కు పనిచేశారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు దర్శకుడిగా వెంకటేశ్‌తో త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నారు.
ఈ ప్రాజెక్ట్ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది(Movie Started). కుటుంబ కథా చిత్రాలకు, స్వచ్ఛమైన వినోదానికి, లోతైన భావోద్వేగాలకు పేరుగాంచిన త్రివిక్రమ్ ఈసారి వెంకటేశ్‌ను ఎలా చూపించబోతున్నారోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చిత్రం కొత్త అనుభూతినిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. హారికా క్రియేషన్స్ (Harika Creations)బ్యానర్‌పై నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. పూజా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.