సూపర్ స్టార్ మహేశ్ బాబు(Super Star Mahesh babu), నమ్రతా శిరోద్కర్ సారథ్యంలోని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ (GMB Entertainments) సమర్పణలో, సత్యదేవ్(Actor Satyadev) ప్రధాన పాత్ర(Playing Lead Role)లో రూపొందిన కొత్త చిత్రం ‘రావు బహదూర్’(Rao Bahaddur). ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి విలక్షణమైన సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్ మహా(Director Venkatesh Maha)
ఈ సినిమాకు దర్శకుడు. చిత్రాన్ని ఏఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మించాయి. తాజాగా ఈ సినిమా టీజర్ను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశారు. జమీందారీ నేపథ్యంలో సాగే ఈ కథలో, ఒక పురాతన కోటలో ఒంటరిగా నివసించే వ్యక్తి చుట్టూ అల్లిన డ్రామా, సైకలాజికల్ థ్రిల్, డార్క్ హ్యూమర్ అంశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశాయి. ఈ చిత్రంలో సత్యదేవ్ యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు వేర్వేరు
రూపాల్లో కనిపించి, వివిధ రకాల భావోద్వేగాలను పలికించారు. ఈ టీజర్‌లో వికాస్ ముప్పాల, దీపా థామస్, ఆనంద్ భారతి వంటి కీలక నటీనటులను కూడా పరిచయం చేశారు. ఈ చిత్రం తెలుగుతో పాటు ఇతర భాషల సబ్‌టైటిల్స్‌తో 2026 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.