స్పెయిన్ అధికారిక పండగ (Spain Official Festival)అయిన టమాటో ఫెస్టివల్ భారత్‌లో మొదటిసారి(First Time in India) భాగ్యనగరం(Hyderabad City)లో జరుగనున్నది. ఏటా స్పెయిన్ పౌరులు ప్రతిష్ఠాత్మకంగా ఈ పండుగ జరుపుకొంటారు. పండుగ కోసం నిర్వాహకులు వేలాది టన్నుల టమాటాలు(Tons of Tomatoes) కేటాయిస్తారు. హైదరాబాద్‌లోని ఎక్క్స్పీరియం పార్క్‌లో ఈనెల 11న అలాంటి ఈవెంట్ జరుగనున్నది. ‘ప్రిజం అవుట్ డోర్స్’ అనే సంస్థ ఈ వేడుక నిర్వహించనున్నది.
2011లో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ‘జిందగీ న మిలేగీ దుబారా’ చిత్రంలో ఈ టమోటో ఫెస్టివల్‌ను వెండితెరపై చూపించారు. కానీ.. నాడు ఈ అంశం వివాదాస్పదమైంది. వేలాది కుటుంబాలు తిండి లేక అల్లాడుతుంటే.. టమాటాలతో హోలీ ఆడుకోవడం ఏంటనే..? ప్రశ్నలు దుమారం రేపాయి. ఆ తర్వాత 2013లో కొందరు బీహార్ రాజధాని పాట్నాలో టమాటో ఫెస్టివల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుండగా అనుకోని కారణాలతో ఫెస్టివల్ ఆగిపోయింది.
ఆ పరిణామాల తర్వాత హైదరాబాద్‌లో మరోసారి టమాటో ఫెస్టివల్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న మాట!