‘యానిమల్’ చిత్రంతో తళుక్కుమన్న త్రిప్తి డిమ్రి (Triphti Dimri).. అప్పటి నుంచి వెనక్కితిరిగి చూసుకోలేనంత బిజీగా సినిమాలు చేస్తోంది. ఆమె కెరీర్ ఇప్పుడు జోరు(Career On Fire) మీద ఉంది. తాజాగా ఆమె ‘ధడక్2’ (Dhadak2 Movie) క్రేజీ ప్రాజెక్టు (Crazy Project)లో కథానాయికగా ఎంపికై అందరికీ షాక్ ఇచ్చింది. ప్రీక్వెల్‌ను శశాంక్ ఖైతాన్‌ను డైరెక్ట్ చేయగా, సీక్వెల్ (Sequel Movie)కు షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహిస్తున్నారు.
‘ధడక్’ మొదటి భాగంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా పరిచయం కాగా, సీక్వెల్‌కు కూడా ఆమెనే హీరోయిన్‌గా ఎంపికవుతుందని అందరూ భావించారు. కానీ, దర్శకుడు జాన్వీకి బదులుగా త్రిప్తిని హీరోయిన్‌గా ఎంపిక చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సిద్ధాంత్ చతుర్వేద్‌కి జోడీగా త్రిప్తి నటించనుంది. ‘ధడక్2’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్టు 1న విడుదలకు సిద్ధమవుతోంది.
మరోవైపు త్రిప్తి ప్రభాస్‌తో కలసి నటించే అవకాశం కూడా దక్కించుకున్నది. ‘స్పిరిట్’ అనే టైటిల్‌తో క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో మొదట దీపికా పదుకొణేను సంప్రదించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆమె ఓకే కాలేదు. చివరికి ఆమె స్థానంలో త్రిప్తి ఖరారైనట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో త్రిప్తి మాట్లాడుతూ,
“స్పిరిట్ సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నా. ప్రభాస్‌తో కలిసి నటించడమంటే కొత్త అనుభవం. సందీప్ వంగా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అదే కాకుండా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఓ విభిన్న కథా చిత్రంలో కూడా నటిస్తున్నా. అది ఈ ఏడాదిలోనే విడుదలవుతుంది’ అని అందాల భామ చెప్పుకొచ్చింది.