end
=
Tuesday, October 14, 2025
వార్తలుఅంతర్జాతీయంనోబెల్ శాంతి బహుమతి.. ఒబామా పై ట్రంప్‌ అక్కసు
- Advertisment -

నోబెల్ శాంతి బహుమతి.. ఒబామా పై ట్రంప్‌ అక్కసు

- Advertisment -
- Advertisment -

Washington: నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(President Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎనిమిది యుద్ధాలను ఆపినప్పటికీ ఈ ప్రతిష్ఠాత్మక బహుమతి రావచ్చో లేదో తెలియదంటూ విచారం వ్యక్తం చేశారు. నోబెల్ కమిటీ ఈరోజు శాంతి బహుమతిని ప్రకటించనుండగా ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైట్‌హౌస్‌లో తాజాగా విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌ 2009లో బహుమతి అందుకున్న ఒబామా(Obama)ను తీవ్రంగా విమర్శించారు. “ఒబామా ఏమి చేయలేదు, అయినా నోబెల్ బహుమతి పొందారు. ఆయనకు ఆ బహుమతిని ఎందుకిచ్చారో ఆయన్నే అడిగితే, ఆయన్ను కూడా తెలియదు. ఒబామా అమెరికాను నాశనం చేశారు. కానీ నేను? ఎనిమిది యుద్ధాలు ఆపాను. అంతమాత్రానా నాకేమైనా ఇస్తారా? తెలీదు ” అని అన్నారు. ట్రంప్ తన పాలనలో గాజాలో శాంతి నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించానని తెలిపారు. మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే అనేక ఘర్షణలను నివారించానని పేర్కొన్నారు. నేను నోబెల్ కోసం ఇవన్నీ చేయలేదు. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. నా చర్యల వల్ల లక్షల మంది ప్రాణాలు దక్కాయి. ఇది ఎప్పటికీ జరుగనిది అని వ్యాఖ్యానించారు.

నోబెల్ బహుమతి కోసం ట్రంప్‌ పేరును పాకిస్థాన్‌ సైన్యాధిపతి అసీమ్‌ మునీర్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వంటి ప్రముఖులు నామినేట్ చేసినట్టు సమాచారం. ఇది ట్రంప్‌కు మరింత ఆశలు కలిగించగా, ఆయన గతంలో కూడా పలుమార్లు “నాకు నోబెల్ రావాల్సిందే” అంటూ పరోక్షంగా అభిప్రాయపడిన సందర్భాలున్నాయి. ఈరోజు నోబెల్‌ శాంతి బహుమతిపై అధికారిక ప్రకటన వెలువడనుండగా, దానికి ముందు ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా, మౌలికంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యల ద్వారా ట్రంప్‌ తనపై జరుగుతున్న నోబెల్ అన్యాయాన్ని ప్రశ్నించినట్లుగా కనిపిస్తోంది.

2009లో అధ్యక్ష పదవిని చేపట్టిన కొద్ది నెలలకే ఒబామాకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ఆయన “అంతర్జాతీయ మైత్రి మరియు అణ్వాయుధ నిర్మూలన” కోసం చూపించిన ప్రాథమిక సంకల్పం ఆ బహుమతికి కారణమని నోబెల్‌ కమిటీ తెలిపింది. కానీ ట్రంప్‌ మాత్రం ప్రభుత్వం స్థాయిలో అనేక యుద్ధాలు ఆపిన తనకు ఈ బహుమతి రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి ఇప్పట్లో ట్రంప్‌కు లభిస్తుందా లేదా అన్నది అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ఆయన వ్యాఖ్యలు మాత్రం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాయి. యుద్ధాల ఆపోతీసు, శాంతి ప్రయత్నాల వాస్తవ ఫలితాలే కాక, రాజకీయ ప్రేరణలూ నోబెల్ కమిటీ నిర్ణయాల్లో ఎంత మేరకు ప్రభావితం చేస్తాయన్నది మాత్రం ఈ వ్యాఖ్యల మధ్య మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -