ప్రత్యేక గీతాల స్పెషల్ బ్యూటీగా పేరున్న బాలీవుడ్ నటి(Bollywood beauty) ఊర్వశీ రౌతేలా(Urvasi Rautela) తెలుగులో ‘స్కంద’, ‘బ్రో’, ‘ఏజెంట్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘డాకు మహారాజ్’ వంటి చిత్రాల్లో యువతను ఉర్రూతలూగించింది. సినిమాల్లోనే కాదు ఫ్యాషన్, ట్రెండీ దుస్తుల్లో కనిపిస్తూ సామాజిక మాధ్యమా(Social Media)ల్లోనూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఈ భామ ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశీ మాట్లాడుతూ.. “ఉత్తరాఖండ్(Uttarakhand)లో నా పేరు మీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే పక్కనే కిలోమీటర్ దూరంలో ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి.
ఢిల్లీ విశ్వవిద్యాలయం లోనూ నా ఫోటోకు పూలమాలలు వేసి నన్ను ‘దండమమాయి’ అని పిలుస్తారు. ఇది నిజం. మొదటిసారి ఈ విషయం తెలిసి నేను కూడా ఆశ్చర్యపోయాను. దీనిపై వార్తా కథనాలు కూడా ఉన్నాయి. నా మాటలను నమ్మనివాళ్లు ఆ వార్తలను చదవచ్చు. టాలీవుడ్ హీరోలు చిరంజీవి, పవన్‌కల్యాణ్, బాలకృష్ణలతో కలిసి నటించాను. అక్కడ కూడా నాకు ఎంతో మంది అభిమానులు(Hardcore Fans) ఉన్నారు. దక్షిణ భారతదేశంలో కూడా నాకు రెండో ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నా” అని చెప్పింది.
బద్రినాథ్‌కు కిలోమీటర్ దూరంలో ఉన్న గుడికి వచ్చినవారు మీ ఆశీర్వాదం తీసుకుంటారా? అని యాంకర్ అడగ్గా.. అది ఆలయం.. అన్నిచోట్లా ఏం జరుగుతాయో అక్కడ కూడా అవే జరుగుతాయి’ అని బదులిచ్చింది ఊర్వశి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఊర్వశీ రౌతేలా ఇప్పుడు పూర్తిగా భ్రమలో మునిగిపోయింది’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.