end
=
Friday, May 17, 2024
వార్తలుఅంతర్జాతీయం‘బాంబ్ సైక్లోన్’తో వణికిపోతున్న అమెరికా
- Advertisment -

‘బాంబ్ సైక్లోన్’తో వణికిపోతున్న అమెరికా

- Advertisment -
- Advertisment -

  • ‘-40’డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • 5,500 విమాన సర్వీసుల రద్దు

America : ఒకవైపు చైనాలో కరోనా విలయతాండం చేస్తుంటే.. మరోవైపు అమెరికాలో (America) తీవ్రంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రతి సంవత్సరం నమోదయ్యే సాధారణ వాతవరణ లెక్కల కంటే ఈ సారి అత్యంత అరుదుగా చోటుచేసుకునే -40 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. మంచు (snow) తీవ్రంగా కురుస్తుండడంతో వందల సంఖ్యలో విమానాలు (Airoplain) రద్దు అయ్యాయి. ముఖ్యమైన రహదారులను మూసివేశారు. క్రిస్ మస్ (Chris Mus)కు ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో పండుగపూట ప్రయాణం చేద్దామనుకున్న వారికి నిరాశే ఎదురైంది. పెద్ద ఎత్తున హిమపాతం, గాలులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే ఇలాంటి పరిస్థితులు అతి తరుచుగా నమోదు కాగా, వీటిని బాంబ్ సైక్లోన్ (Bomb Cyclone)అని పిలుస్తారు. పరిస్థితి ఇంతకుముందులా కాదని చాలా తీవ్రంగా ఉందని అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే అధికారులు పౌరులను ఇంటికి రావొద్దని సలహాలు జారీ చేశారు. ప్రస్తుతం బయటకొస్తే నిమిషాల్లో గడ్డ కట్టే పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు. మిన్నేపాలిస్, సెయింట్ పాల్ (Minneapolis, St. Paul) ప్రాంతాల్లో 24 గంటల్లోనే 8 ఇంచుల మేర మంచు పేరుకుపోయిందని అధికారులు తెలిపారు. దాదాపు శుక్రవారం వరకు ఇదే పరిస్థితులు ఉంటాయని రోడ్లు రవాణాకు సాధ్యపడేలా లేవని అధికారులు తెలిపారు. గురువారం 22వేల విమానాలు ఆలస్యం కాగా, సుమారు 5,500లకు పైగా విమానాలు రద్దయ్యాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -