end
=
Tuesday, June 24, 2025
సినీమా‘వీరమల్లు’ వచ్చేది అప్పుడే.. డేట్​ లాక్​   
- Advertisment -

‘వీరమల్లు’ వచ్చేది అప్పుడే.. డేట్​ లాక్​   

- Advertisment -
- Advertisment -

పవర్​స్టార్​ (Power Star) పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan)  యోధుడి (Warrior Story)గా నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం (Producer AM Ratnam)సమర్పణలో మెగాసూర్య ప్రొడక్షన్స్ (Mega Surya Productions) పతాకంపై ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వీరు కాక​అనేక మంది దిగ్గజ నటులు చిత్రంలోనటిస్తున్నారు.

పవన్‌కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అటు మేకింగ్‌లో ఆలస్యమైంది. ఆ తర్వాత విడుదల విషయంలోనూ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెల 12న బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అయితే, తాజాగా నిర్మాతలు మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూలై 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తాజా విడుదల తేదీని మేకర్స్ వెల్లడించారు.

చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి; సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్; ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వీఎస్; స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్‌లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్; కూర్పు: ప్రవీణ్ కేఎల్; కళా దర్శకుడు: తోట తరణి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -