end
=
Wednesday, August 13, 2025
సినీమాఅక్కడ తళుక్కుమననున్న జంట
- Advertisment -

అక్కడ తళుక్కుమననున్న జంట

- Advertisment -
- Advertisment -

అమెరికాలోని న్యూయార్క్‌ (On Nweyork Venue)లో జరగనున్న 43వ వార్షిక ఇండియా డే పరేడ్‌ (Annual India Day)లో టాలీవుడ్ మోస్ట్​ వంటెడ్​ జంట(Most Wanted Tollywood Couple) విజయ్ దేవరకొండ(Actror Vijay Devarakonda), రష్మిక మందన్నా(Rahsmika Mandanna) కో-గ్రాండ్ మార్షల్స్‌గా తళుక్కుమననున్నారు. ఆగస్టు 17న న్యూయార్క్‌లోని మాడిసన్ అవెన్యూలో ‘సర్వే భవంతు సుఖినః’ (అందరూ సుఖంగా ఉండాలి) అనే థీమ్‌తో ఈ వేడుకలు జరుగనున్నాయి. వేడుకలను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో అట్టహాసంగా జరుగుతాయి.

విదేశాల్లో భారత్ ప్రతిష్ఠను పెంచడం, భారతీయ సంస్కృతిని విస్తరించడం ఈ పరేడ్ ప్రధాన లక్ష్యాలని నిర్వాహకులు తెలిపారు. 1981లో ఒక చిన్న పరేడ్‌గా మొదలైన ఈ కార్యక్రమం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా డే వేడుకగా గుర్తింపు పొందింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఆరు భాషల్లో (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్) పంపిన ప్రత్యేక వీడియో సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సందేశం వేడుకల పట్ల అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -